అసలు బెయిల్ ఎందుకివ్వాలి?
రాం జెఠ్మలానీ లాంటి విశ్వవిఖ్యాత న్యాయవాది బండెడు పుస్తకాలు శోధించి వాదించినా.. చివరకు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తే తమకు అభ్యంతరం లేదంటూ సీబీఐ తరఫు న్యాయవాదులు చెప్పినా కూడా జయలలితకు బెయిల్ రాలేదు. అసలు జయలలితకు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఏమీ కనిపించడంలేదని ఈ కేసును విచారించిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి. చంద్రశేఖర స్పష్టం చేశారు.
దాంతో ఇటు బోనులో ఉన్న జయలలితకు, అటు బయట ఉన్న అభిమానులకు కూడా తీవ్ర ఆశాభంగం తప్పలేదు. అంతకుముందు సీబీఐ తరఫు న్యాయవాదులు తమకు అభ్యంతరం లేదని చెప్పగానే జయలలితకు బెయిల్ వచ్చేసిందన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే చివరకు విచారణ ముగిసే సమయానికి న్యాయమూర్తి మాత్రం ఆమెకు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఏమీ తనకు కనపడటం లేదని స్పష్టం చేయడంతో.. అన్నాడీఎంకే అభిమానుల ఆశల మీద నీళ్లు చల్లినట్లయింది.