జయ బెయిల్ పిటిషన్పై సుప్రీంలో వాదనలు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభం అయ్యాయి. జయలలిత తరఫున ప్రముఖ న్యాయవాదులు నారిమన్, సుశీల్ కుమార్, తులసి వాదనలు వినిపిస్తున్నారు. అక్రమాస్తుల కేసులో నాలుగు సంవత్సరాల జైలు శిక్ష పడిన జయలలిత.. కర్ణాటక హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోగా, అక్కడి న్యాయమూర్తి తిరస్కరించిన విషయం తెలిసిందే.
దాంతో ఆమె సుప్రీంను ఆశ్రయించారు. విచారణ జరుగుతున్న గది బయట సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. విచారణ హాలు వద్ద భారీ సంఖ్యలో న్యాయవాదులు గుమిగూడారు. లోపల కిక్కిరిసి ఉండటంతో ఎవరినీ అనుమతించలేదు.