![రాంజెఠ్మాలనీ...హరీష్ సాల్వే కావాలి - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/41412583174_625x300_0.jpg.webp?itok=EnPSW1dJ)
రాంజెఠ్మాలనీ...హరీష్ సాల్వే కావాలి
బెంగళూరు : అక్రమాస్తుల కేసులో బెంగళూరు జైల్లో ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత...ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మాలనీ పక్కన పెట్టినట్లు సమాచారం. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే సమయంలో హరీష్ సాల్వేతో వాదనలు వినిపించాల్సిందిగా ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. జయ తరపున కర్ణాటక హైకోర్టులో రాంజెఠ్మాలనీ వాదనలు వినిపించిన విషయం తెలిసిందే.
కాగా సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు జయలలిత తరపున న్యాయవాదులు తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు. అక్కడైనా ఆమెకు బెయిల్ దక్కేనా అన్న చర్చ జరుగుతోంది. ఇక కర్ణాటక హైకోర్టులో నలుగురూ కలసి ఒకే సమయంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినందుకే చుక్కెదురయ్యిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే జయలలిత తరపు న్యాయవాదుల నిర్లక్ష్యంతోనే బెయిల్ లభించలేదని చర్చించుకుంటున్నారు. మరి హరీష్ సాల్వే అయినా అమ్మను జైలు నుంచి బయటకు రప్పిస్తారేమో చూడాలి.