Harish Salve
-
అప్పీలుకు వెళ్దామంటే వినేశ్ ఒప్పుకోలేదు: హరీశ్ సాల్వే
భారత ఒలింపిక్ సంఘం(ఐఓఏ)పై రెజ్లర్ వినేశ్ ఫొగట్ సంచలన ఆరోపణల నేపథ్యంలో ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే స్పందించారు. వినేశ్ లాయర్ల నుంచి తమకు ఎలాంటి సహకారం లభించలేదన్న ఆయన.. స్పోర్ట్స్ కోర్టు తీర్పుపై స్విస్ కోర్టులో అప్పీలుకు వెళ్దామంటే వినేశ్ నుంచి సానుకూల స్పందన రాలేదన్నారు. కాగా ప్యారిస్ ఒలిపింక్స్-2024లో మహిళల యాభై కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ విభాగంలో వినేశ్ ఫొగట్ ఫైనల్ చేరుకున్న విషయం తెలిసిందే. అయితే, స్వర్ణ పతక పోరుకు ముందు నిర్ణీత బరువు కంటే వంద గ్రాములు ఎక్కువగా ఉండటంతో ఆమెపై వేటు పడింది. ఫైనల్లో పాల్గొనకుండా యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ అనర్హురాలిగా ప్రకటించింది. రజత పతకమైనా ఇవ్వాలని కోరగాఈ క్రమంలో వినేశ్ ఫొగట్, ఐఓఏ స్పోర్ట్స్ కోర్టును ఆశ్రయించింది. కానీ, అప్పటికే టైటిల్ రేసు మొదలైందని.. అందుకే వినేశ్‌కు పోటీలో పాల్గొనే అవకాశం ఇవ్వలేమని సదరు న్యాయస్థానం పేర్కొంది.అయితే, సెమీస్ వరకు నిబంధనల ప్రకారం గెలిచాను కాబట్టి కనీసం సంయుక్త రజతమైనా ఇవ్వాలన్న వినేశ్ ఫొగట్ అభ్యర్థన పిటిషన్‌ను స్వీకరించింది. ఈ క్రమంలో వినేశ్ తరఫున హరీశ్ సాల్వేతో పాటు విదూశ్‌పత్ సింఘానియా వాదనలు వినిపించారు. అనేక వాయిదాల అనంతరం కోర్టు తీర్పునిస్తూ.. ఒక్క గ్రాము బరువు ఎక్కువగా ఉన్నా నిబంధనలకు విరుద్ధమే అంటూ వినేశ్‌కు రజతం ఇవ్వలేమంటూ పిటిషన్‌ను కొట్టిపారేసింది.ఐఓఏపై వినేశ్ ఆరోపణలుఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన వినేశ్ ఫొగట్ మాట్లాడుతూ.. స్పోర్ట్స్ కోర్టుకు వెళ్లిన సమయంలో ఐఓఏ నుంచి తనకు ఎలాంటి సహకారం లభించలేదని ఆరోపించింది. దేశం తరఫున కాకుండా.. తన పేరు మీదే పిటిషన్ వేయాల్సిన పరిస్థితి వచ్చిందని.. అయితే, అక్కడా తనకు న్యాయం జరుగలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో హరీశ్ సాల్వే తాజాగా స్పందించారు.వినేశ్ లాయర్లు సహకరించలేదు‘‘ఈ కేసులో మాకు, అథ్లెట్ నియమించుకున్న లాయర్లకు మధ్య సమన్వయం లోపించింది. నిజానికి భారత ఒలింపిక్ సంఘం మెరుగైన వ్యక్తుల(తమను ఉద్దేశించి)ను ఆమె కోసం నియమించింది. కానీ.. ఆమె లాయర్లు మాత్రం.. ‘మీతో మేము ఎలాంటి విషయాలు పంచుకోము. మాకు తెలిసిన సమాచారం మీకు ఇవ్వము’ అన్నట్లుగా ప్రవర్తించారు. ఫలితంగా ప్రతి అంశంలోనూ ఆలస్యమైంది.అయిన్పటికీ మా శక్తి వంచన లేకుండా ఆఖరి వరకు పోరాడాము. అయితే, చివరకు మాకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అప్పుడు కూడా నేను ఆమెకు ఓ సూచన చేశాను. మనం స్విస్ కోర్టుకు వెళ్దామని చెప్పాను. అందుకు ఆమె ముందుకు రాలేదు కూడాకానీ తన లాయర్లు మత్రం ఆమెకు ఇక ముందుకు వెళ్లే ఉద్దేశంలేదని చెప్పారు’’ అని హరీశ్ సాల్వే చెప్పుకొచ్చారు. కాగా ఈ పరిణామాల తర్వాత 30 ఏళ్ల వినేశ్ ఫొగట్ కుస్తీకి స్వస్తి పలికి రాజకీయాల్లో చేరింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులనా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేస్తోంది.చదవండి: Vinesh Phogat: వినేశ్ ఫొగట్ ఆస్తి వివరాలు వెల్లడి.. ఎన్ని కోట్లంటే? -
CASలో ముగిసిన వినేశ్ కేసు వాదనలు.. తీర్పు వాయిదా
ముగిసిన వినేశ్ కేసు వాదనలు.. తీర్పు వాయిదాఅయితే తాజాగా CAS మరో ప్రకటన విడుదల చేసింది. తీర్పును రేపటికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఆగష్టు 11 సాయంత్రం ఆరు గంటల తర్వాత తమ నిర్ణయం వెల్లడిస్తామని పేర్కొంది.భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అనర్హతపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్)లో విచారణ పూర్తైంది. సీఏఎస్ అడ్‌హక్ కమిటీ ఆర్బిట్రేటర్ డాక్టర్ అనాబెలె బెన్నెట్ ముందు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) తరఫున సీనియర్ లాయర్లు హరీశ్ సాల్వే, విదూశ్‌పత్ సింఘానియా వాదనలు బలంగా వినిపించారు. ప్రతివాదులైన యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ), అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)లు ప్రధానంగా నిబంధనల గురించే వివరించింది. దీనిపై తమ వాదనే పైచేయి సాధిస్తుందని, సానుకూల తీర్పు వస్తుందని ఐఓఏ కొండంత ఆశతో ఎదురుచూస్తోంది. మొత్తానికి రెండు రోజులుగా జరుగుతున్న విచారణ శుక్రవారంతో పూర్తైంది. ప్రకటన విడుదల చేసిన సీఏఎస్ఆదివారం మెగా ఈవెంట్ ముగియనున్న నేపథ్యంలో ఈరోజే తీర్పు వెలువడే అవకాశముందని తెలిసింది. అయితే, శనివారం రాత్రి 9.30 నిమిషాల తర్వాత తమ తీర్పును వెలువరించనున్నట్లు సీఏఎస్ ప్రకటన తాజాగా విడుదల చేసింది.కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో మహిళల 50 కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ విభాగంలో వినేశ్ ఫొగాట్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. ప్రిక్వార్టర్స్‌లో వరల్డ్ నంబర్ వన్, జపాన్‌కు చెందిన సుసాకీని ఓడించి చరిత్ర సృష్టించిన ఈ హర్యానా అథ్లెట్.. తదుపరి రెండు ఆటంకాలను కూడా దిగ్విజయంగా దాటేసింది. రజతమైనా ఇవ్వండిక్వార్టర్ ఫైనల్స్, సెమీస్‌లో వరుస విజయాలతో స్వర్ణ పతక రేసుకు అర్హత సాధించింది. అయితే, ఫైనల్స్ రోజు వేయింగ్‌లో 100 గ్రాముల అధిక బరువు వల్ల వినేశ్ అనర్హతకు గురైంది. దీంతో కనీసం ఖాయమనుకున్న రజతం కూడా చేజారింది. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వినేశ్ ఫొగాట్.. తన సెమీస్ ప్రదర్శన వరకు వేయింగ్‌లో ఏ సమస్యా లేదని కాబట్టి సంయుక్తంగా రజత పతకం బహూకరించాలని అప్పీలు చేసుకుంది. ఈ క్రమంలో వినేశ్ ఫొగాట్ తరఫున వాదనలు వినిపించేందుకు ఐఓఏ ప్రముఖ లాయర్లు హరీశ్ సాల్వే, విదూశ్‌పత్ సింఘానియాను నియమించుకుంది. దాదాపు గంటకు పైగా హరీశ్ తన వాదనలు వినిపించారని.. ఇందుకు సానుకూల స్పందన వచ్చినట్లు సమాచారం. వినేశ్‌కు రజతం వస్తుందని తాము ధీమాగా ఉన్నామని ఐఓఏ వర్గాలు చెప్పినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. చదవండి: పెళ్లి పీటలెక్కనున్న భారత క్రికెటర్.. నిశ్చితార్థం ఫోటోలు వైరల్ -
CAS: వినేశ్ పిటిషన్‌పై సీఏఎస్ అధికారిక ప్రకటన
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ పిటిషన్‌పై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. వినేశ్ పిటిషన్‌ను తాము స్వీకరించామని.. అయితే ఈరోజే తమ నిర్ణయం వెల్లడించలేమని తెలిపింది. కాగా మహిళల 50 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో తలపడ్డ వినేశ్ ఫొగట్.. సంచలన విజయాలతో ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే.మరో అవకాశం కోసంఅయితే, బుధవారం నాటి ఫైనల్ బౌట్‌కు ముందు.. నిర్ణీత 50 కిలోల కంటే వంద గ్రాములు ఎక్కువ బరువు ఉందన్న కారణంగా యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్(UWW) ఆమెపై వేటు వేసింది. ఫైనల్ పోరుకు ముందు ఉదయం నిర్వహించిన వెయిన్‌లో వినేశ్ అధిక బరువు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే, ఈ విషయంపై వినేశ్ తక్షణమే సీఏఎస్‌ను ఆశ్రయించింది. తనకు మరో అవకాశం ఇచ్చి పోటీకి అనుమతించాలని కోరింది.అందుకే పరిగణనలోకి తీసుకోలేదుఇందుకు బదులుగా.. ‘‘గోల్డ్ మెడల్ మ్యాచ్‌కు తనను అనుమతించాలన్న వినేశ్ అభ్యర్థనను మేము పరిగణనలోకి తీసుకోలేం. ఎందుకంటే.. తను ఏరోజైతే ఫిర్యాదు చేసిందో అదే రోజు మ్యాచ్ కూడా ఉంది. అంతేకాదు.. తను మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని కూడా కోరలేదు.అడ్‌హక్ డివిజన్ ప్రక్రియ వేగవంతంగానే ఉంటుంది. కానీ మరీ గంటలో నిర్ణయం తీసుకోవడం కుదరదు. ముందుగా UWW వాదనలు కూడా వినాలి. ఆ తర్వాత.. ఫిర్యాదుదారు వాదనలు వినాలి. ఇందుకు ఎక్కువ సమయమే పడుతుంది. కాబట్టి ఇది వీలుపడదు.ఆరోజే నిర్ణయం వెల్లడిస్తాంఅయితే, అప్లికెంట్ తనకు సంయుక్తంగా రజత పతకం ఇవ్వాలన్న పిటిషన్‌ను మాత్రం స్వీకరించాం. గౌరవనీయులైన మా సోలో ఆర్బిట్రేటర్ డాక్టర్ అనబెలె బెనెట్ ఈరోజు ఇరు వర్గాల వాదనలు వింటారు. ఒలింపిక్ క్రీడల ముగింపులోపు తన నిర్ణయాన్ని వెల్లడిస్తారు’’ అని సీఏఎస్ తన ప్రకటనలో పేర్కొంది. కాగా వినేశ్ తరఫున ప్రముఖ లాయర్ హరీశ్ సాల్వే వాదనలు వినిపించనున్నట్లు సమాచారం. -
Vinesh Phogat: ‘రజత’ పతక తీర్పుపై ఉత్కంఠ
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటు నేపథ్యంలో కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) తీర్పు కీలకంగా మారింది. తనకు అన్యాయం జరిగిందంటూ వినేశ్ వేసిన పిటిషన్‌ను సీఏఎస్ శుక్రవారం విచారించనుంది. నిజానికి.. వినేశ్ అనర్హత, పతకం నిరాకరణపై సీఏఎస్‌లోని అడ్‌హక్ కమిటీ గురువారం రాత్రే విచారించాల్సింది.ఇందుకోసం నలుగురు లాయర్లతో కూడిన బృందాన్ని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఏర్పాటు చేసుకుంది. అయితే బలమైన వాదన, పూర్తిస్థాయి సన్నద్ధత కోసం నిష్ణాతులైన లాయర్లతో అప్పీలును గెలిచేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న ఐఓఏ ఒకరోజు గడువు కోరింది. దీన్ని మన్నించిన సీఏఎస్ శుక్రవారం మధ్యాహ్నానికి విచారణను వాయిదా వేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో భారత ఒలింపిక్ సంఘం వినేశ్ తరఫున వాదనలు వినిపించేందుకు ప్రఖ్యాత న్యాయవాది హరీశ్ సాల్వేను నియమించుకున్నట్లు తెలుస్తోంది. భారత మాజీ సాలిసిటర్ జనరల్ అయిన హరీశ్ సాల్వేకు ఘనమైన రికార్డు ఉంది. భారత్‌లోని టాప్ లాయర్లలో ఒకరిగా పేరుగాంచిన ఆయన.. 1999- 2002 వరకు సాలిసిటర్ జనరల్‌గా పనిచేశారు.కుల్‌భూషణ్ జాదవ్ కేసు(2017) విషయంలో అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ తరఫున వాదనలు వినిపించిన హరీశ్ సాల్వే.. పాకిస్తాన్లో కుల్‌భూషణ్‌కు మరణశిక్ష పడకుండా తప్పించగలిగారు.అదే విధంగా.. రతన్ టాటా వర్సెస్ సైరస్ మిస్త్రీ(2016)లో రతన్ టాటా తరఫున వాదించి ఆయనకు గెలుపును బహుమతిగా ఇచ్చారు. 2012 నాటి 2G స్పెక్ట్రమ్ కేసులోనూ సాల్వే జాతీయ దర్యాప్తు సంస్థ తరఫున వకాల్తా పుచ్చుకుని.. వాదనలు వినిపించారు. ఇలాంటి ప్రముఖ కేసులెన్నో వాదించిన హరీశ్ సాల్వే.. వినేశ్ ఫొగట్ తరఫున రంగంలోకి దిగడం ఆసక్తికరంగా మారింది.కాగా వినేశ్ ఫొగట్ తన అనర్హతను సవాలు చేస్తూ రజత పతకం కోసం కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్)లో అప్పీలు చేసిన విషయం తెలిసిందే. ఒకవేళ సీఏఎస్‌లో వినేశ్‌కు అనుకూలంగా తీర్పు వస్తే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) వినేశ్‌కు సంయుక్తంగా రజత పతకం బహూకరించే అవకాశముంది. -
ఎందుకంత ఆందోళన? బాబు లాయర్లతో సుప్రీం బెంచ్
సాక్షి, ఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సర్వోన్నత న్యాయస్థానంలో మాజీ సీఎం చంద్రబాబుకు ఊరట దక్కలేదు. బాబు పిటిషన్ ఆధారంగా ఇప్పటికిప్పుడు ఈ అంశాన్ని తేల్చలేమంటూ.. విచారణను వాయిదా వేసింది సుప్రీం. అయితే.. చంద్రబాబు పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. వాడీవేడి వాదనలు జరిగాయి. పీసీ యాక్ట్ 17 ఏ చంద్రబాబు కేసులో వర్తిస్తుందా? లేదా? అనే అంశం ప్రధానంగా వాదనలు జరిగాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో తనపై ఏపీ సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని ఏపీ హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబుకి ఎదురుదెబ్బ తగిలింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు.. సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. ఎట్టకేలకు ఈ పిటిషన్‌పై మంగళవారం జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేదిల ధర్మాసనం వాదనలు వింది. చంద్రబాబు తరపున సీనియర్ లాయర్లు సిద్ధార్థ్ లూథ్రా, హరీష్‌సాల్వే, అభిషేక మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ తరుణంలో.. ఈ పిటిషన్‌పై ఎంత మంది సీనియర్లు వాదిస్తారంటూ బెంచ్ పశ్నించగా.. నలుగురం అంటూ తేలికపాటి స్వరంతో సాల్వే బదులిచ్చారు. అయినా మేం ముకుల్ రోహత్గీకి(ఏపీ ప్రభుత్వ తరుపున లాయర్) సరిపోమని సాల్వే తెలిపారు. అయితే ఇవాళ మాత్రం వాదనలు ముగ్గురే వినిపించారు. తొలుత.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఎఫ్ఐఆర్లో నమోదు అయిన అంశాలపైనే హరీష్ సాల్వే వాదనలు(వర్చువల్)గా వినిపించారు. ‘‘చంద్రబాబు కేసు పూర్తి రాజకీయపరమైంది. గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేశారు. హైకోర్టు 17ఏ వర్తించదని చెప్పడం సరికాదు. ఈ క్రమంలో.. సెక్షన్ 17 ఏ పై హైకోర్టు న్యాయమూర్తి అభిప్రాయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు హరీష్ సాల్వే. ఈ సెక్షన్ ఎంక్వైరీ తేదీ గురించి చెబుతుంది తప్ప.. నేరం జరిగిన తేదీ గురించి కాదు. సెక్షన్ 17 ఏ ప్రకారం చంద్రబాబుకు రక్షణ ఉంటుంది అని సాల్వే వాదనలు వినిపించారు. ఇక.. ఇది కేవలం కక్ష సాధింపు చర్యే. 73 ఏళ్ల మాజీ ముఖ్యమంత్రిని వేధిస్తున్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నారు కాబట్టి పరిస్థితిని అర్థం చేసుకోవాలి. పోలీస్ కస్టడీ అడుగుతున్నందునా.. ముందే విచారణ చేపట్టాలని చంద్రబాబు తరపు మరో న్యాయవాది లూథ్రా బెంచ్‌కు తెలిపారు. మరో న్యాయవాది మను సింఘ్వీ.. యశ్వంత్ సిన్హా కేసు తీర్పును ఉదాహరించారు. ఇది కేవలం మంత్రిమండలిలో తీసుకున్న నిర్ణయమని మాత్రమే అభియోగాలున్నాయని తెలిపారు. అయితే.. ఇప్పుడే కేసు మెరిట్‌లోకి వెళ్లదల్చుకోలేదని బెంచ్ తెలిపింది. ఏకంగా క్వాష్ అడుగుతున్నారు ఇక ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. 17ఏతో ఈకేసుకు ఎలాంటి సంబంధం లేదు. జులై 2018లో 17-A వచ్చింది. అంతకంటే ముందే ఈ కేసు విచారణ ప్రారంభమైంది ఇందులో రాజకీయ కక్ష లేదు. ఈ కేసులో దర్యాప్తు 2017 కంటే ముందే మొదలయింది. అప్పుడే దీన్ని CBI పరిశీలించింది. ఇక రాజకీయ కక్ష అని ఎలా అంటారు? తప్పు చేసింది 2015-16లో. దర్యాప్తు మొదలయింది ఈ ప్రభుత్వం రాకముందే. ఇప్పుడు దాన్ని కక్ష అని ఎలా అంటారు? చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఈ కేసు విచారణ ప్రారంభమైంది. జీఎస్టీ విభాగం అప్పట్లోనే దర్యాప్తు చేపట్టింది. ఒకసారి ఈ డాక్యుమెంట్లు చూడండి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు APSDCని ప్రారంభించారు. కేవలం 10% ప్రభుత్వం ఇస్తే చాలన్నారు. 90% మరో సంస్థ గిఫ్ట్‌గా ఇస్తుందన్నారు. ఆ వెంటనే 10% నిధులు ప్రభుత్వ ఖజానా నుంచి విడుదలయ్యాయి. అరెస్టయిన మూడు రోజుల్లోనే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. బెయిల్ కోసం ప్రయత్నించకుండా ఇప్పుడు క్వాష్ అడుగుతున్నారు. అందుకే చంద్రబాబు పిటిషన్ ను తిరస్కరించాలి అని ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ధర్మాసనం వ్యాఖ్యలు చంద్రబాబు లాయర్లకు పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. బెంచ్ పలు ప్రశ్నలు సంధించింది. విచారణ మాత్రమే జరుగుతోందని మీకెందుకు అంత ఆందోళన? అని ప్రశ్నించింది. 2015-16లో నేరం జరిగింది కదా ? . ఆ లెక్కన 2018లో అవినీతి నిరోధక చట్టంలో 17-a రాకముందే నేరం జరిగింది కదా?. మరోవైపు.. ఐపీసీ కింద నమోదైన నేరాల పరిస్థితి ఏమిటి ?. పీసీ యాక్ట్ తో పాటు ఐపీసీ కింద కూడా నేరాలు నమోదయ్యాయి కదా అని ప్రశ్నించింది. ఈ దశలో రూలింగ్ ఇవ్వలేమని.. తర్వాతి విచారణలో వాదనలు వింటామని స్పష్టం చేసింది. సుదీర్ఘ వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం.. రెండు వైపులా అఫిడవిట్ ఇవ్వాలని, హైకోర్టులో క్వాష్ పిటిషన్ సందర్భంగా ఇచ్చిన అన్ని పత్రాలను సమర్పించాలని ఆదేశిస్తూ.. చంద్రబాబు పిటిషన్‌పై విచారణను వచ్చే సోమవారానికి(9వ తేదీకి) వాయిదా వేసింది. -
అవినీతి చేసినవారు సెక్షన్ 17A పేరుతో తప్పించుకోలేరు
-
68 ఏళ్ల హరీశ్ సాల్వేకు మూడో పెళ్లి
న్యూఢిల్లీ: ప్రముఖ న్యాయవాది, మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే మూడోసారి పెళ్లి కొడుకయ్యారు. 68 ఏళ్ల జనరల్ హరీశ్ సాల్వే లండన్‌లో త్రినా అనే మహిళను వివాహం చేసుకున్నారు. అత్యంత వైభవంగా ఈ పెళ్లి వేడుకకు నీతా అంబానీ, సునీల్ మిట్టల్, లలిత్ మోదీ తదితర ప్రముఖులు హాజరయ్యారు. హరీశ్ సాల్వేకు ఇది మూడో వివాహం. ఆయన మొదట మీనాక్షిని వివాహమాడారు. వారికి ఇద్దరు కుమార్తెలు సాక్షి, సానియా ఉన్నారు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత మీనాక్షి నుంచి విడిపోయారు. 2020 జూన్‌లో విడాకులు తీసుకున్నారు. అదే సంవత్సరం కరోలిన్ బ్రోసార్డ్ను పెళ్లి చేసుకున్నారు. కొంత కాలానికి ఆమె నుంచి దూరమయ్యారు. ఇప్పుడు మూడోసారి త్రినాను పెళ్లాడారు. హరీశ్ సాల్వే 1999 నవంబర్ నుంచి 2002 నవంబర్ వరకూ ఇండియా సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. టాటా గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ గ్రూప్ వంటి ప్రఖ్యాత సంస్థల కేసులను వాదించారు. భారత ప్రభుత్వం 2015లో హరీశ్ సాల్వేకు ‘పద్మ భూషణ్’ పురస్కారం ప్రకటించింది. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’పై అధ్యయం చేయడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలో హరీశ్ సాల్వే సభ్యుడిగా ఉన్నారు. -
హిండెన్‌బర్గ్‌పై హరీష్ సాల్వే సంచలన వ్యాఖ్యలు!
అమెరికా షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్, అదానీ గ్రూప్ వివాదంపై మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే సంచలన వ్యాఖ్యలు చేశారు. హిండెన్‌బర్గ్ ‘నో గుడ్ స్మార్టానీయన్’.అందుకు పూర్తిగా విభిన్నమైంది. మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ల నుంచి డబ్బుల్ని కొల్లగొట్టడం విచారకరమని అన్నారు. హిండెన్ బర్గ్ రీసెర్చ్ - అదానీ గ్రూప్ అంశంపై ఓ మీడియా సంస్థ నిర్వహించిన డిబెట్లో పాల్గొన్న హరీష్ సాల్వే.. హిండెన్ బర్గ్ తీరును విమర్శించారు. హిండెన్ బర్గ్ నో స్మార్టానీయన్. అవకాశావాది. తమకు అనుగుణంగా నివేదికను విడుదల చేయడం, మళ్లీ అదే నివేదికను కనుమరుగు చేయడం ఏంటని ప్రశ్నించారు. హిండెన్‌బర్గ్ సంస్థను 'అనైతిక షార్ట్ సెల్లర్'గా అభివర్ణించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఆరుగురు సభ్యుల కమిటీ అదానీ- హిండెన్ బర్గ్ వ్యవహారంపై నిజానిజాలు నిగ్గు తేలుస్తుందని అన్నారు. షేర్ వ్యాల్యూని తగ్గించి టన్నుల కొద్ది మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ల పెట్టబుడుల్ని కాజేసింది ఎవరనేది స్పష్టం చేస్తుందని తెలిపారు. హిండెన్ బర్గ్ స్టాక్ మార్కెట్‌ను మానిప్యులేషన్ చేయడంలో దిట్ట. ఆ సంస్థ ట్రేడింగ్ చేయకుండా నిషేధం విధించాలి. ఉదాహరణకు కంపెనీలు స్టాక్ మార్కెట్లోని మదుపర్లని మోసం చేస్తున్నాయని నిజంగా అనిపిస్తే.. అందుకు తగ్గ ఆధారాలుంటే వెంటనే భారత స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీని, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖను సంప్రదిస్తే విచారణ జరిపిస్తారు. కానీ అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ అలా చేయలేదు. డైరెక్ట్‌గా రిపోర్ట్‌లను అడ్డం పెట్టుకొని కంపెనీలపై దాడులకు పాల్పడిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అలా అని సెబీ చూస్తూ కూర్చొదుగా. ఎవరు స్టాక్ మార్కెట్లోని అలజడని సృష్టించి తద్వారా డబ్బుల్ని సంపాదిస్తున్నారు. మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ల డబ్బుల్ని కాజేస్తున్నారో ఇలా అందర్ని వెలుగులోకి తెస్తుందన్నారు. మనదేశంలో ఇదో కొత్త గేమ్. కేపిటల్ మార్కెట్ వృద్ది సాధిస్తోంది. స్టాక్ మార్కెట్లో లిస్టైన ప్రతి కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు సామాన్యులు మక్కువ చూపుతుంటారు. హిండెన్ బర్గ్ లాంటి రిపోర్ట్లు వెలుగులోకి వచ్చి.. అవి అబ్ధమని రుజువయ్యే సమయానికి సదరు కంపెనీల షేర్లకు నష్టం వాటిల్లింతుందని వెల్లడించారు. కాగా, సుప్రీం కోర్ట్ ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఆరుగురు సభ్యులుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏఎం సప్రే, ఎస్బీఐ మాజీ చైర్మన్ ఓపీ భట్, రిటైర్డ్ బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేపీ దేవధర్, ఇన్ఫోసిస్ మాజీ చైర్మన్ కేవీ కామత్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, న్యాయవాది సోమశేఖరన్ సుందరేశన్ ఉన్నారని మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే చెప్పారు. -
జాతీయ ప్రణాళిక కావాలి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తుండడం, మరణాల సంఖ్య పెరుగుతుండడం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా బాధితులకు ప్రాణవాయువు, అత్యవసర ఔషధాలు అందుబాటులో లేకపోవడం విచారకరమని పేర్కొంది. కరోనా కట్టడి వ్యూహం, ఆక్సిజన్, ఔషధాల సరఫరాపై జాతీయ ప్రణాళిక అవసరమంది. దేశంలో కరోనా కల్లోల పరిస్థితిని సుప్రీంకోర్టు గురువారం సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఇండియాలో కోవిడ్ వ్యాక్సినేషన్ సాగుతున్న విధానాన్ని పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. మహమ్మారి వ్యాప్తిని అరికట్టడం కోసం రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించే జ్యుడీషియల్ అధికారం హైకోర్టులకు ఉందా? లేదా? అనేది పరిశీలిస్తామంది. దేశంలో కనీసం 6 హైకోర్టుల్లో కోవిడ్ సంబంధిత అంశాలు విచారణలో ఉన్నాయని గుర్తుచేసింది. సుమోటో విచారణలో తమకు సహకరించేందుకు సీనియర్ అడ్వొకేట్ హరీష్ సాల్వేను అమికస్ క్యూరీగా సుప్రీంకోర్టు ధర్మాసనం నియమించింది. కోర్టులు వాటి అధికారాలను ఉపయోగించుకుంటున్నాయి ఇండియాలో కరోనా ప్రస్తుత పరిస్థితి, నియంత్రణ చర్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది. కొన్ని అంశాలపై సుమోటోగా విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు తెలియజేసింది. ఢిల్లీ, బాంబే, సిక్కిం, మధ్యప్రదేశ్, కలకత్తా, అహ్మదాబాద్ హైకోర్టుల్లో కరోనా పరిస్థితికి సంబంధించిన అంశాలు విచారణలో ఉన్నాయని తెలిపింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆయా న్యాయస్థానాలు వాటి పరిధిలోని అధికారాలను ఉపయోగించుకుంటున్నాయని వివరించింది. ఒక కోర్టు ఒక అంశానికి, మరో కోర్టు మరో అంశానికి ప్రాధాన్యం ఇస్తుండడంతో గందరగోళం తలెత్తుతోందని వెల్ల డించింది. కాబట్టి నాలుగు కీలక అంశాలు.. ఆక్సిజన్ సరఫరా, అత్యవసర ఔషధాల పంపిణీ, వ్యాక్సినేషన్ విధానం, లాక్డౌన్ ప్రకటనపై హైకోర్టులకు ఉన్న అధికారంపై దృష్టి పెడతామని స్పష్టం చేసింది. ఈ నాలుగు అంశాలపై ప్రభుత్వానికి నోటీసు ఇస్తున్నామని, వీటిపై జాతీయ ప్రణాళిక తమకు కావాలని వ్యాఖ్యానించింది. జాతీయ ప్రణాళికను హైకోర్టులకు సమర్పించాలని సొలిసిటర్ జనరల్‌కు ధర్మాసనం సూచించింది. -
లండన్ ఆర్టిస్టుతో హరీష్ సాల్వే రెండోపెళ్లి
లండన్: ప్రముఖ న్యాయవాది, భారత మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే, లండన్ ఆర్టిస్టు కరోలిన్ బ్రొసార్డ్‌ను వివాహం చేసుకోనున్నారు. లండన్‌లోని చర్చిలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య బుధవారం వీరి పెళ్లి జరుగనుంది. వీరిరువురికి ఇది రెండో వివాహం. హరీష్ సాల్వే గతంలో మీనాక్షిని వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి ఇద్దరు కూతుళ్లు సాక్షి సాల్వే, సానియా సాల్వే సంతానం. కాగా ఈ ఏడాది జూన్‌లో హరీష్ సాల్వే, తన భార్య మీనాక్షికి విడాకులు ఇచ్చారు. ఇక యూకేకు చెందిన ఆర్టిస్టు కరోలిన్ బ్రొసార్డ్(56)కు 18 ఏళ్ల కూతురు ఉన్నారు. కాగా సుప్రీంకోర్టు న్యాయవాది అయిన హరీష్ సాల్వే, ఈ ఏడాది జనవరిలో కోర్ట్స్ ఆఫ్ ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్వీన్స్ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. ఈ క్రమంలో, ప్రస్తుతం యూకేలో నివసిస్తున్న ఆయన, ఓ ఆర్ట్ ఈవెంట్లో కరోలిన్‌ను కలిసినట్లు తెలుస్తోంది. థియేటర్, శాస్త్రీయ సంగీతం పట్ల అభిరుచి వీరిద్దరిని సన్నిహితులను చేసినట్లు సమాచారం. ఇక తాను వివాహం చేసుకోనున్నట్లు 65 ఏళ్ల హరీష్ సాల్వే సోమవారం ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హరీష్ సాల్వేకు తోటి న్యాయవాదులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. (చదవండి: భావోద్వేగం: ‘ఒక్క రూపాయి ఫీజు కోసం ఇంటికి రమ్మన్నారు’) ఒక్క రూపాయి ఫీజు 1955లో మహారాష్ట్రలో జన్మించిన హరీష్ సాల్వే సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేసిన విషయం తెలిసిందే. అదే విధంగా భారత సొలిసటర్ జనరల్‌గా విధులు నిర్వర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపిన కుల్‌భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో భారత్ గెలిచే విధంగా తన వాదనలు వినిపించి ప్రఖ్యాతి గడించారు. కుల్‌భూషణ్ విషయంలో.. పాకిస్తాన్ వక్రబుద్ధిని బట్టబయలు చేస్తూ.. ఐసీజే ముందు వారి కుట్రలను వివరించారు. దీంతో న్యాయస్థానంలోని 16 మంది న్యాయమూర్తుల్లో 15 మందిని ఒప్పించగలికారు. సుదీర్ఘ కాలం పాటు సాగిన కేసు విచారణలో.. ఎట్టకేలకు భారత్ పైచేయి సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఆయన.. ఈ కేసు వాదించేందుకు గానూ కేవలం ఒక్క రూపాయి ఫీజు మాత్రమే తీసుకోవడం గమనార్హం. Congratulations to Harish Salve, Sr. Advocate & queen's counsel for starting new innings of life with Caroline Brossard. pic.twitter.com/1Y1Xn6N28n — Prateek som (@Prateeksom2) October 25, 2020 -
‘చిన్నమ్మ’ చివరి కోరిక తీర్చిన కుమార్తె
న్యూఢిల్లీ: దివంగత కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ చివరి కోరికను నెరవేర్చారు ఆమె కుమార్తె బన్సూరి. ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వేకు, సుష్మ ఇవ్వాల్సిన రూ.1 ఫీజును శుక్రవారం చెల్లించారు బన్సూరి. ఈ సందర్భంగా ‘కుల్‌భూషణ్ జాదవ్ కేసులో వాదించి, గెలిచినందుకు గాను హరీశ్ సాల్వేకు ఇవ్వాల్సిన ఫీజు రూ.1ని ఈ రోజు చెల్లించి నీ చివరి కోరిక నెరవేర్చాను అమ్మ’ అంటూ బన్సూరి ట్విట్ చేశారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో కుల్‌భూషణ్ జాదవ్ తరఫున హరీశ్ వాదించి గెలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చనిపోవడానికి కేవలం గంట ముందు సుష్మా స్వరాజ్ హరీశ్‌తో మాట్లాడారు. ‘మీరు కేసు గెలిచారు.. మీకివ్వాల్సిన ఫీజు రూ.1 తీసుకెళ్లండి’ అని చెప్పారు అంటూ హరీశ్ గుర్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్న బన్సూరి స్వరాజ్, హరీశ్ సాల్వేకు ఆయన ఫీజు చెల్లించారు. గూఢచర్యం ఆరోపణలతో పాకిస్తాన్ జైల్లో ఉన్న మాజీ నౌకాదళ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు పాక్ న్యాయస్థానం విధించిన మరణశిక్షను నిలుపదల చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు ఇచ్చేలా చేయడంలో హరీశ్ సాల్వే వాదనలు కీలకంగా నిలిచిన సంగతి తెలిసిందే. (చదవండి: వయసుకి చిన్నమ్మ.. మనసుకి పెద్దమ్మ) -
‘ఒక్క రూపాయి ఫీజు కోసం ఇంటికి రమ్మన్నారు’
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ (67) మృతిపై ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె చనిపోవడానికి గంట ముందే ఆమె తనతో మాట్లాడారని గుర్తు చేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు. హరీష్ సాల్వే అంతర్జాతీయ న్యాయస్థానంలో కులభూషన్ జాదవ్ తరపున ప్రభావవంతంగా వాదించి భారత్‌కు విజయం అందించిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణకు ఆయన కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఫీజుగా తీసుకున్నారు. (చదవండి : సుష్మా హఠాన్మరణం) కులభూషన్ జాదవ్ కేసు గెలవడంతో తనకు ఇవ్వాల్సిన రూ.1 ఫీజు తీసుకోవడానికి రేపు ఇంటికి రావాల్సిందిగా సుష్మా తనను ఆహ్వానించారని, ఇంతలోనే ఆమె అనంతలోకాలకు వెళ్లిపోయారని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.‘ సుష్మా స్వరాజ్‌తో నేను నిన్న రాత్రి 8.50గంటల సమయంలో మాట్లాడాను. మా ఇద్దరి మధ్య సంభాషణ చాలా ఉద్వేగంగా సాగింది. ‘మీరు కేసు గెలిచారు కదా.. దానికి నేను మీకు ఒక్క రూపాయి ఫీజు ఇవ్వాలి వచ్చి కలవండి’ అని అన్నారు. దానికి నేను, ‘అవును మేడమ్ ఆ విలువైన రూపాయిని నేను తీసుకోవాల్సిందే’ అని బదులిచ్చాను. దీంతో ఆమె ‘మరి రేపు 6గంటలకు రండి’ అన్నారు’’ అని సుష్మాతో సాగిన సంభాషణను హరీష్ సాల్వే గుర్తుచేసుకొని ఉద్వేగానికి లోనయ్యారు. గూఢచర్యం ఆరోపణలతో పాకిస్తాన్ జైల్లో ఉన్నభారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్(49)కు పాక్ న్యాయస్థానం విధించిన మరణశిక్షణను నిలుపుదల చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో హరీశ్ వాదనలే కీలకం. సాధారణంగా అయితే కేసులు వాదించేందుకు హరీశ్ సాల్వే ఒక్కో రోజుకి రూ. 30 లక్షలను ఫీజుగా తీసుకుంటారని సమాచారం. కానీ ఈ కేసు వాదించడానికి కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్నారు. పాక్ తరఫున బ్రిటన్‌కు చెందిన లాయర్ ఖురేషీ వాదనలు వినిపించారు. జాధవ్ కేసును వాదించేందుకు ఫీజుగా ఆయనకు రూ. 20 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇటీవల జాదవ్ ఉరిపై అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పట్ల సుష్మాస్వరాజ్ హర్షం వ్యక్తం చేశారు. భారత్‌కు దక్కిన విజయంగా అభివర్ణించారు. దీనిపై హరీష్ సాల్వేను ఆమె ప్రశంసించారు. (చదవండి : ఉరి.. సరి కాదు) -
జాధవ్ కేసు: కేవలం ఒక్క రూపాయే ఛార్జ్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన కులభూషన్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) బుధవారం తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో భారత్ గెలుపుపై ప్రధానితో సహ దేశ వ్యాప్తంగా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే అంతర్జాతీయ వేదికపై భారత్ గెలుపులో ఆ కేసును వాదించిన భారత న్యాయవాది హరీష్ సాల్వే కృషి వర్ణించలేనిది. గూఢచర్యానికి, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్టు నిర్ధారిస్తూ 2017 ఏప్రిల్‌లో మిలటరీ కోర్టు ఆయనకు మరణ శిక్ష విధించిన విషయం తెలిసిందే. దీనిపై భారత విదేశాంగ శాఖ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. ఐసీజేని ఆశ్రయించింది. భారత పిటిషన్‌ను స్వీకరించిన అంతర్జాతీయ న్యాయస్థానం పలుమార్లు ఇరు దేశాల వాదనలను విన్నది. అంతర్జాతీయ కోర్టులో భారత్‌కు విజయం భారత్ తరఫున వాదనలు వినిపించిన హరీష్ సాల్వే.. పాక్ వక్రబుద్ధిని బట్టబయలు చేస్తూ.. ఐసీజే ముందు వారి కుట్రలను వివరించారు. అంతేకాదు కులభూషన్ జాదవ్ నిర్దోషి అని ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో న్యాయస్థానంలోని 16 మంది న్యాయమూర్తుల్లో 15 మందిని ఒప్పించగలికారు. సుధీర్ఘ కాలం పాటు సాగిన కేసు విచారణలో.. ఎట్టకేలకు భారత్ పైచేయి సాధించింది. పాక్ సైనిక కోర్టు కుల్‌భూషణ్ జాదవ్‌కు విధించిన మరణ శిక్షను నిలిపివేయాలని తీర్పు వెలువరించింది. అయితే సాల్వే గురించి మరో విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాల్సి ఉంది. ఈ కేసు విచారణకు ఆయన కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఫీజుగా తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సుష్మాస్వరాజ్ ట్విట్లో వెల్లడించారు. దీనిపై ఆయనకు దేశ వ్యాప్తంగా ప్రశంశలు అందుతున్నాయి. ఇప్పటికే సుష్మాస్వరాజ్ ట్విటర్ వేదికగా ఆయనపై ప్రశంసల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. -
డాక్యుమెంట్లను క్షుణ్నంగా పరిశీలిస్తాం
-
తీవ్రమైన అంశాలున్నాయి!
న్యూఢిల్లీ: సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి బీహెచ్ లోయా మృతికి సంబంధించి పిటిషన్లలో లేవనెత్తిన అంశాలు చాలా తీవ్రమైనవని, అన్ని పత్రాల్ని చాలా క్షుణ్నంగా పరిశీలిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. లోయా మృతిపై సమగ్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ ప్రారంభించింది. ఈ కేసులో బాంబే హైకోర్టుకు చెందిన నాగ్‌పూర్, ముంబై ధర్మాసనాలు విచారిస్తోన్న మరో రెండు పిటిషన్లను సుప్రీంకోర్టుకు ధర్మాసనం బదిలీ చేసింది. లోయా మృతిపై ఇకపై ఎలాంటి పిటిషన్లు దాఖలైనా వాటిని విచారణకు స్వీకరించవద్దని అన్ని హైకోర్టుల్ని ఆదేశించింది. ఇంతవరకూ కోర్టుకు సమర్పించని పత్రాలను ఫిబ్రవరి 2లోగా తమ ముందుంచాలని కోర్టు ఆదేశించింది. అదే సమయంలో ఈ కేసులో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పేరును తెరపైకి తేవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే తీరును కోర్టు తప్పుపట్టింది. షాపై ఆరోపణల పట్ల సాల్వే అభ్యంతరం లోయా మృతిపై కాంగ్రెస్ నేత తెహ్సీన్ పూనావాల్లా, జర్నలిస్టు బీఎస్ లోనే దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. కిక్కిరిసిన కోర్టు గదిలో దాదాపు గంటపాటు న్యాయవాదుల మధ్య వాడీవేడిగా వాదనలు సాగాయి. బాంబే న్యాయవాదుల విభాగం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదిస్తూ.. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పేరును ప్రస్తావించారు. షాను రక్షించే క్రమంలోనే ఇదంతా జరిగిందని ఆరోపించారు. మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీం జోక్యం చేసుకుని.. ‘ఇప్పటివరకైతే ఇది సహజ మరణమే. ఇప్పుడు ఆ విధమైన ఆరోపణలు చేయొద్దు’ అని దవేకు సూచించింది. వెంటనే దవే లేచి.. ఈ కేసులో అమిత్ షా తరఫున గతంలో సాల్వే హాజరయ్యారని, ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన వాదించడం సరికాదని అన్నారు. ‘ఎవరి తరఫున ఎవరు హాజరవ్వాలనేది న్యాయవాదుల విచక్షణకే వదిలేస్తున్నాం. మేం బార్ కౌన్సిల్ కాదు. మిమ్మల్ని మేం ఆపలేము. కేసుకు సంబంధించిన అన్ని రికార్డుల్ని సంబంధిత పార్టీలు కోర్టుకు సమర్పించాలి’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో స్వతంత్ర విచారణ జరిపించాలని లోయా తండ్రి, సోదరిలు కోరారని దవే వెల్లడించారు. ఈ కేసులో తాను ఎలాంటి విచారణ కోరడం లేదని లోయా కుమారుడి ప్రకటనకు ముందు.. అప్పటి బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అతన్ని తన చాంబర్‌కు పిలిపించుకోవడాన్ని దవే ప్రశ్నించారు. మహారాష్ట్ర ప్రభుత్వ పత్రాల్ని పిటిషనర్ల న్యాయవాదులకు మాత్రమే అందుబాటులో ఉంచాలని సాల్వే కోర్టుకు విజ్ఞప్తి చేశారు. జైసింగ్ వ్యాఖ్యలపై సుప్రీం ఆగ్రహం ఈ కేసులో మీడియా కవరేజీని కోర్టు అడ్డుకోవచ్చేమోనని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ సందేహం వ్యక్తం చేయగా.. ఆ వ్యాఖ్యలపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి వ్యాఖ్యలు సరికాదని.. వెంటనే వాటిని వెనక్కి తీసుకుని, క్షమాపణలు చెప్పాలని సీజేఐ మిశ్రా ఆదేశించారు. దాంతో ఇందిరా జైసింగ్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు చెప్పారు. ‘ఇది చాలా అనుచితం. మీడియాను అడ్డుకునే విషయంపై కనీసం నేను ఒక్క మాటైనా మాట్లాడానా? మీడియా కవరేజీని నిరోధిస్తూ ఏదైనా ఆదేశాన్ని జారీ చేశానా?’ అని జస్టిస్ మిశ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసు చాలా తీవ్రమైందని, అందువల్ల విచారణ సమయంలో మీడియా నివేదికల ఆధారంగా కోర్టు వ్యవహరించదని బెంచ్ పేర్కొంది. నిష్పాక్షిక దృష్టితో పరిశీలిస్తాం వాదనలు ముగిశాక ధర్మాసనం స్పందిస్తూ.. లోయా మృతికి సంబంధించిన అన్ని పత్రాల్ని నిష్పాక్షిక దృష్టితో మరింత లోతుగా పరిశీలిస్తామని తెలిపింది. అనంతరం తదుపరి విచారణను ఫిబ్రవరి 2కు వాయిదా వేసింది. సున్నితమైన సోహ్రబుద్దీన్ నకిలీ ఎన్కౌంటర్ కేసును విచారిస్తోన్న లోయా.. డిసెంబర్ 1, 2014న స్నేహితుడి కుమార్తె పెళ్లి కోసం నాగ్‌పూర్ వెళ్లిన సమయంలో గుండెపోటుతో మరణించారు. సోహ్రబుద్దీన్ కేసులో అమిత్‌షాతోపాటు రాజస్తాన్ హోం మంత్రి గులాబ్ చంద్ కటారియా, గుజరాత్ పోలీసు మాజీ చీఫ్ పీసీ పాండే తదితరులు కేసు ప్రారంభ దశలో నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. -
సీనియర్ న్యాయవాదికి చంపేస్తామని బెదిరింపులు
న్యూఢిల్లీ: ‘పద్మావత్’ సినిమా నిర్మాతల తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వేను చంపేస్తామని రాజ్‌పుత్ కర్నిసేన బెదిరింపులకు దిగుతున్నట్టు తెలుస్తోంది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావత్’ సినిమాకు వ్యతిరేకంగా కర్ణిసేన పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాము కర్ణిసేన ప్రతినిధులమని, ‘పద్మావత్’ సినిమాకు అనుకూలంగా వాదించినందుకు తీవ్ర పరిణామాలు తప్పవని సాల్వేను కొందరు ఫోన్ చేసి బెదిరించినట్టు సమాచారం. ‘ కర్ణిసేన నా కార్యాలయానికి ఫోన్ చేసి బెదరించింది. దమ్ముంటే పోలీసులకు ఫిర్యాదు చేసుకోవాలని సవాల్ విసిరింది’ అని సాల్వే మీడియాతో తెలిపారు. సాల్వేను చంపేస్తామని గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించడంతో వారిపై ఎఫ్ఐఆర్ నమోదుచేసినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. వివాదాస్పదంగా మారిన ‘పద్మావత్’ సినిమా ఈ నెల 25న విడుదలకు సిద్ధమవుతున్నప్పటికీ.. కర్ణిసేన మాత్రం ఈ సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనలు ఏమాత్రం ఆపడం లేదు. సినిమా విడుదలైతే.. థియేటర్లు తగలబెడతామని, తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తోంది. ‘పద్మావత్’కు అనుకూలంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా కర్ణిసేన తగ్గకపోవడంతో ఈ సినిమా విడుదల ఉత్కంఠ రేపుతోంది. -
హరీష్ సాల్వే ఫీజు.. ఒక్క రూపాయే!
-
హరీష్ సాల్వే ఫీజు.. ఒక్క రూపాయే!
ఆయన సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది. ఏదైనా కేసు ఒప్పుకున్నారంటే ఒక్క రోజుకు రూ. 5 లక్షల నుంచి 15 లక్షల వరకు కూడా ఫీజు తీసుకుంటారు. కానీ ఆ ఒక్క కేసు విషయంలో మాత్రం.. ఆయన డబ్బులను ఏమాత్రం లెక్కచేయలేదు. దేశభక్తి ముందు డబ్బులు తనకు బలాదూర్ అని చెప్పి, కేసు మొత్తం వాదించినందుకు కేవలం ఒకే ఒక్క రూపాయి ఫీజు తీసుకుంటున్నారు. అది ఏం కేసని అనుకుంటున్నారా? పాకిస్తాన్లో గూఢచారి అని ముద్రవేసి మరణశిక్ష విధించిన కులభూషణ్ జాదవ్ కేసు. అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ జరుగుతున్న ఈ కేసులో భారతదేశం తరఫున ఆయన వాదిస్తున్నారు. సాల్వే నిర్ణయం తెలిసి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా ఆశ్చర్యపోయారు. హరీష్ సాల్వే సాధారణంగా సుప్రీంకోర్టులోను, ఢిల్లీ హైకోర్టులోనే వాదిస్తారు. అరుదుగా మాత్రమే వేరే కోర్టులకు వస్తారు. చాలా పెద్ద కేసు అనుకున్నప్పుడు, ప్రతిష్ఠాత్మకంగా భావించినప్పుడు మాత్రమే ఆయనను తీసుకొస్తారు. సాల్వేకి యాపిల్ ఉత్పత్తులంటే చాలా ఇష్టం. అవి లాంచ్ అయిన కొద్ది గంటల్లోనే ఆయన ఇంట్లో ఉండాలి. పియానో వాయిస్తారు, జాజ్ అంటే ఇష్టం, అప్పుడప్పుడు తన బెంట్లీ కారును స్వయంగా నడుపుకొంటూ వెళ్తారు. గతంలో భారత మాజీ అటార్నీ జనరల్ సోలీ సొరాబ్జీ వద్ద సాల్వే పనిచేశారు. సల్మాన్ ఖాన్, ముఖేష్ అంబానీ లాంటి పెద్దవాళ్ల తరఫున వాదించిన హరీష్ సాల్వే.. గుజరాత్ అల్లర్ల కేసులో జాతీయ మానవహక్కుల కమిషన్ కోరిక మేరకు బిల్కిస్ బానో తరఫున వాదించారు. గతంలో ఇదే అంతర్జాతీయ కోర్టులో మార్షల్ ఐలండ్స్ విషయంలో భారత్ మీద వచ్చిన వివాదాన్ని ఆయన విజయవంతంగా తిప్పికొట్టారు. -
ఫొటోకు దండ వేసేస్తాం.. జాగ్రత్త!
జాతీయ స్థాయిలో అగ్రశ్రేణి కేసులు వాదించే ఖరీదైన న్యాయవాదిగా పేరున్న హరీష్ సాల్వేకు మాఫియా డాన్ రవి పూజారి నుంచి బెదిరింపులు వచ్చాయి. 'ఫొటోకు దండ వేసేస్తాం జాగ్రత్త' అని బెదిరించినట్లు తెలుస్తోంది. ఆయన కార్యాలయానికి +61 (ఆస్ట్రేలియా) నెంబరు నుంచి ఫోన్ వచ్చిందని, అయితే ఆ సమయానికి ఆయన వేరే దేశంలో ఉన్నారని చెబుతున్నారు. అయితే ఇది జరిగిందని గానీ, జరగలేదని గానీ సాల్వే కార్యాలయ వర్గాలు నిర్ధారించడంలేదు. చాలాకాలంగా ఆస్ట్రేలియాలో దాగున్న రవి పూజారి ఢిల్లీలో ఓ ప్రముఖుడిని బెదిరించడం ఇదే మొదటిసారి. ఎక్కువగా ముంబైలోనే అతడి కార్యకలాపాలు కొనసాగేవి. ఈ కాల్ ఆస్ట్రేలియాలోని న్యూకేజిల్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. దాన్ని బట్టి రవి పూజారి ఎక్కడున్నాడో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే కేంద్ర హోంశాక, విదేశీ వ్యవహారాల శాఖలకు కూడా సమాచారం అందించారు. రవి పూజారి భార్య పద్మ, 14 ఏళ్ల కొడుకు గత సంవత్సరం ముంబై ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డారు. అదే సమయంలో జమాయిత్ ఉల్ ఉలేమా లీగల్ సెల్ కార్యదర్శి గుల్జార్ అజ్మీని బెదిరించినందుకు రవిపూజారిపై ఎఫ్ఐఆర్ కూడా దాఖలైంది. -
బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన సల్మాన్
ముంబై : హిట్ అండ్ రన్ కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడిన టాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు బెయిల్ కోసం అతని తరపు లాయర్లు బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. సల్మాన్ ఆరోగ్యంగా ఉన్నారని... ఈ నేపథ్యంలో ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని అతని తరపు లాయర్లు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ కేసుపై మరికొద్ది సేపట్లో వాదనలు ప్రారంభంకానున్నాయి. సల్మాన్ ఖాన్ తరపున ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే హైకోర్టులో వాదించనున్నారు. -
రాంజెఠ్మాలనీ...హరీష్ సాల్వే కావాలి
బెంగళూరు : అక్రమాస్తుల కేసులో బెంగళూరు జైల్లో ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత...ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మాలనీ పక్కన పెట్టినట్లు సమాచారం. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే సమయంలో హరీష్ సాల్వేతో వాదనలు వినిపించాల్సిందిగా ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. జయ తరపున కర్ణాటక హైకోర్టులో రాంజెఠ్మాలనీ వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. కాగా సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు జయలలిత తరపున న్యాయవాదులు తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు. అక్కడైనా ఆమెకు బెయిల్ దక్కేనా అన్న చర్చ జరుగుతోంది. ఇక కర్ణాటక హైకోర్టులో నలుగురూ కలసి ఒకే సమయంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినందుకే చుక్కెదురయ్యిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే జయలలిత తరపు న్యాయవాదుల నిర్లక్ష్యంతోనే బెయిల్ లభించలేదని చర్చించుకుంటున్నారు. మరి హరీష్ సాల్వే అయినా అమ్మను జైలు నుంచి బయటకు రప్పిస్తారేమో చూడాలి. -
అటార్నీ, సొలిసిటర్ జనరళ్ల రాజీనామా
** నూతన ఏజీ, ఎస్జీలుగా హరీశ్ సాల్వే, ముకుల్ రోహ్తగీ? న్యూఢిల్లీ: కేంద్రంలో నూతన సర్కారు కొలువుదీరిన నేపథ్యంలో అటార్నీ జనరల్ గులామ్ ఎస్సాజీ వాహనవతి, సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్‌లు రాజీనామా సమర్పించారు. కోర్టులలో ప్రభుత్వానికి ప్రతినిధులుగా వ్యవహరిస్తూ, క్లిష్టమైన అంశాలపై న్యాయ సలహాలు ఇచ్చేందుకుగాను ఏజీ, ఎస్జీలను ప్రభుత్వం నియమించుకుంటుంది కాబట్టి.. ప్రభుత్వాలు మారినప్పుడు ఆ పదవుల్లో ఉన్నవారు రాజీనామా చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి రాజీనామా ప్రక్రియ పూర్తి అయిందని, నూతన ప్రభుత్వం కొత్త ఏజీ, ఎస్జీలను నియమించుకుంటుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. కొత్త ఏజీ, ఎస్‌జీల నియామకం గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడకపోయినా.. అటార్నీ జనరల్‌గా సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, ముకుల్ రోహ్తగీలు, నూతన ఎస్జీగా రంజిత్ కుమార్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. యూపీఏ-1లో ఐదేళ్లపాటు ఎస్జీగా వాహనవతి పనిచేశారు. ఏజీగా నియమితులైన తొలి ముస్లిం కూడా వాహనవతియే కావడం గమనార్హం. అలాగే సుప్రీంకోర్టు సీనియర్ న్యావాది అయిన మోహన్ పరాశరన్‌ను యూపీఏ సర్కారు 2004లో అదనపు సొలిసిటర్ జనరల్‌గా, గతేడాది ఫిబ్రవరిలో ఎస్జీగా నియమించుకుంది.