CASలో ముగిసిన వినేశ్ కేసు వాదనలు.. తీర్పు వాయిదా | Vinesh Phogat CAS Hearing Update: Sports Court To Give Verdict Aug 10 | Sakshi
Sakshi News home page

CASలో ముగిసిన వినేశ్ కేసు వాదనలు.. తీర్పు వాయిదా

Published Sat, Aug 10 2024 2:46 PM | Last Updated on Sat, Aug 10 2024 10:35 PM

Vinesh Phogat CAS Hearing Update: Sports Court To Give Verdict Aug 10

ముగిసిన వినేశ్ కేసు వాదనలు.. తీర్పు వాయిదా
అయితే తాజాగా CAS మరో ప్రకటన విడుదల చేసింది. తీర్పును రేపటికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఆగష్టు 11 సాయంత్రం ఆరు గంటల తర్వాత తమ నిర్ణయం వెల్లడిస్తామని పేర్కొంది.

భారత స్టార్‌ మహిళా రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ అనర్హతపై కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ (సీఏఎస్‌)లో విచారణ పూర్తైంది. సీఏఎస్‌ అడ్‌హక్‌ కమిటీ ఆర్బిట్రేటర్‌ డాక్టర్‌ అనాబెలె బెన్నెట్‌ ముందు భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) తరఫున సీనియర్‌ లాయర్లు హరీశ్‌ సాల్వే, విదూశ్‌పత్‌ సింఘానియా వాదనలు బలంగా వినిపించారు. 

ప్రతివాదులైన యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ (యూడబ్ల్యూడబ్ల్యూ), అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ)లు ప్రధానంగా నిబంధనల గురించే వివరించింది. దీనిపై తమ వాదనే పైచేయి సాధిస్తుందని, సానుకూల తీర్పు వస్తుందని ఐఓఏ కొండంత ఆశతో ఎదురుచూస్తోంది. మొత్తానికి  రెండు రోజులుగా జరుగుతున్న విచారణ శుక్రవారంతో పూర్తైంది. 

ప్రకటన విడుదల చేసిన సీఏఎస్‌
ఆదివారం మెగా ఈవెంట్‌ ముగియనున్న నేపథ్యంలో ఈరోజే తీర్పు వెలువడే అవకాశముందని తెలిసింది. అయితే, శనివారం రాత్రి 9.30 నిమిషాల తర్వాత తమ తీర్పును వెలువరించనున్నట్లు సీఏఎస్‌ ప్రకటన తాజాగా విడుదల చేసింది.

కాగా ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024లో మహిళల 50 కిలోల ఫ్రీస్టయిల్‌ రెజ్లింగ్‌ విభాగంలో వినేశ్‌ ఫొగాట్‌ ఫైనల్‌ చేరిన విషయం తెలిసిందే. ప్రిక్వార్టర్స్‌లో వరల్డ్‌ నంబర్‌ వన్‌, జపాన్‌కు చెందిన సుసాకీని ఓడించి చరిత్ర సృష్టించిన ఈ హర్యానా అథ్లెట్‌.. తదుపరి రెండు ఆటంకాలను కూడా దిగ్విజయంగా దాటేసింది. 

రజతమైనా ఇవ్వండి
క్వార్టర్‌ ఫైనల్స్‌, సెమీస్‌లో వరుస విజయాలతో స్వర్ణ పతక రేసుకు అర్హత సాధించింది. అయితే, ఫైనల్స్‌ రోజు వేయింగ్‌లో 100 గ్రాముల అధిక బరువు వల్ల వినేశ్‌ అనర్హతకు గురైంది. దీంతో కనీసం ఖాయమనుకున్న రజతం కూడా చేజారింది. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన వినేశ్‌ ఫొగాట్‌.. తన సెమీస్‌ ప్రదర్శన వరకు వేయింగ్‌లో ఏ సమస్యా లేదని కాబట్టి సంయుక్తంగా రజత పతకం బహూకరించాలని అప్పీలు చేసుకుంది. 

ఈ క్రమంలో వినేశ్‌ ఫొగాట్‌ తరఫున వాదనలు వినిపించేందుకు ఐఓఏ ప్రముఖ లాయర్లు హరీశ్‌ సాల్వే, విదూశ్‌పత్‌ సింఘానియాను నియమించుకుంది. దాదాపు గంటకు పైగా హరీశ్‌ తన వాదనలు వినిపించారని.. ఇందుకు సానుకూల స్పందన వచ్చినట్లు సమాచారం. వినేశ్‌కు రజతం వస్తుందని తాము ధీమాగా ఉన్నామని ఐఓఏ వర్గాలు చెప్పినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.   

చదవండి: పెళ్లి పీట‌లెక్క‌నున్న భారత క్రికెట‌ర్‌.. నిశ్చితార్థం ఫోటోలు వైర‌ల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement