న్యూఢిల్లీ: ప్రముఖ న్యాయవాది, మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే మూడోసారి పెళ్లి కొడుకయ్యారు. 68 ఏళ్ల జనరల్ హరీశ్ సాల్వే లండన్‌లో త్రినా అనే మహిళను వివాహం చేసుకున్నారు. అత్యంత వైభవంగా ఈ పెళ్లి వేడుకకు నీతా అంబానీ, సునీల్ మిట్టల్, లలిత్ మోదీ తదితర ప్రముఖులు హాజరయ్యారు. హరీశ్ సాల్వేకు ఇది మూడో వివాహం. ఆయన మొదట మీనాక్షిని వివాహమాడారు. వారికి ఇద్దరు కుమార్తెలు సాక్షి, సానియా ఉన్నారు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత మీనాక్షి నుంచి విడిపోయారు.
2020 జూన్‌లో విడాకులు తీసుకున్నారు. అదే సంవత్సరం కరోలిన్ బ్రోసార్డ్‌ను పెళ్లి చేసుకున్నారు. కొంత కాలానికి ఆమె నుంచి దూరమయ్యారు. ఇప్పుడు మూడోసారి త్రినాను పెళ్లాడారు. హరీశ్ సాల్వే 1999 నవంబర్ నుంచి 2002 నవంబర్ వరకూ ఇండియా సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. టాటా గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ గ్రూప్ వంటి ప్రఖ్యాత సంస్థల కేసులను వాదించారు. భారత ప్రభుత్వం 2015లో హరీశ్ సాల్వేకు ‘పద్మ భూషణ్’ పురస్కారం ప్రకటించింది. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’పై అధ్యయం చేయడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలో హరీశ్ సాల్వే సభ్యుడిగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment