లక్నో : ఉద్దేశపూరిత రుణ ఎగవేత కేసులో రొటోమాక్ గ్లోబల్ ప్రమోటర్, డైరెక్టర్ విక్రమ్ కొఠారి, ఆయన కుమారుడు రాహుల్ కొఠారి రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను సీబీఐ కోర్టు గురువారం తోసిపుచ్చింది. రూ 3695 కోట్ల రుణ ఎగవేత కేసులో విక్రమ్ కొఠారి దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌నూ మార్చి 7న కోర్టు తిరస్కరించింది. నిందితులిద్దరినీ ఫిబ్రవరి 23న ఢిల్లీలో సీబీఐ అరెస్ట్ చేసినప్పటి నుంచీ వారు జైలు జీవితం గడుపుతున్నారు.
ఇంటరాగేషన్ కోసం వారిని ఫిబ్రవరి 24 నుంచి సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతించింది. మార్చి 7తో సీబీఐ రిమాండ్ ముగియడంతో న్యాయమూర్తి ఎంపీ చౌధురి వారిని జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకుని జైలుకు తరలించారు. కాగా, నిందితులపై తీవ్ర నేరాభియోగాలున్నందున వారికి బెయిల్ ఇవ్వడం తగదని సీబీఐ కోర్టు నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. బ్యాంకుల కన్సార్టియం నుంచి సేకరించిన రుణాలను కంపెనీ డైరెక్టర్లు కొందరు బ్యాంకు అధికారులతో కలిసి కుట్రపూరితంగా దారిమళ్లించి బ్యాంకులను మోసగించారని సీబీఐ సమర్పించిన చార్జిషీట్‌లో ఆరోపించింది.
Comments
Please login to add a commentAdd a comment