సర్కిల్‌లోని వ్యక్తి రోటోమ్యాక్ పెన్ కంపెనీ యజమాని విక్రం కొఠారి
న్యూఢిల్లీ : బ్యాంకులను మోసం చేసిన కేసులో రొటోమ్యాక్ పెన్ కంపెనీ యజమాని విక్రమ్ కొఠారి, ఆయన తనయుడు రాహుల్ కొఠారీలను గురువారం సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఫిర్యాదు రావడంతో సీబీఐ ఆదివారం కొఠారి కుటుంబసభ్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఆదివారం నుంచి నాలుగు రోజుల పాటు విచారించిన సీబీఐ మోసం జరిగినట్లు ప్రాధమిక ఆధారాలు లభ్యమవడంతో గురువారం అరెస్ట్ చేసింది. ప్రాధమిక విచారణలో కొఠారి కటుంబసభ్యులు వడ్డీలతో కలిపి రూ.3,695 కోట్లు బకాయిలు ఉన్నట్లు తేలింది. కోఠారి వివిధ బ్యాంకుల నుంచి రూ.2,919 కోట్లు లోన్ తీసుకున్నారు. దీనికి వడ్డీ రూ.776 కోట్లు అయింది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా(రూ.754.77 కోట్లు), బ్యాంక్ ఆఫ్ బరోడా(456.63), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(771.07 కోట్లు), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(458.95 కోట్లు), అలహాబాద్ బ్యాంక్(రూ.330.68 కోట్లు), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(49.82 కోట్లు), ఓరియంట్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(97.47 కోట్లు) బకాయిలు పడినట్లు ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది. విక్రమ్ కొఠారి, ఆయన కుమారుడు, భార్య, కొంత మంది బ్యాంకు అధికారులు, మరి కొంతమంది ప్రైవేటు వ్యక్తులపై కుట్ర, మోసం, ఫోర్జరీ తదీతర యాక్ట్‌ల కింద కేసు నమోదు చేసి సీబీఐ విచారణ జరుపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment