హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు మరోసారి చుక్కెదురైంది. బెయిల్ కోసం చేసిన అభ్యర్థనను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. కేసు విచారణ కీలక దశలో ఉందని, ఇలాంటి సమయంలో బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు చేసిన అభ్యర్థనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు.. A3 తిరుపతన్న, A4 భుజంగరావు, A5 రాధాకిషన్ రావులు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. తమను అరెస్ట్ చేసి వంద రోజులు దాటిందని, పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో మాండేటరీ బెయిల్ ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు.
ఇదిలా ఉంటే.. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను నాలుగుసార్లు వెనక్కి పంపింది కోర్టు. దీంతో మూడున్నర నెలలు గడుస్తున్న పోలీసులు సక్రమంగా ఛార్జిషీటు వేయలేకపోయారని నిందితుల తరఫు న్యాయవాది వాదించారు. అయితే కేసు విచారణ కీలక దశలో ఉందని, ఇప్పుడు బెయిల్ ఇస్తే దర్యాప్తు ప్రభావితం అవుతుందని పోలీసులు వాదించారు. దీంతో.. పోలీసు వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు.. నలుగురు నిందితుల బెయిల్ పిటిషన్ కొట్టేసింది.
Comments
Please login to add a commentAdd a comment