ఢిల్లీ: ఆప్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌కు ఊరట దక్కలేదు. మనీల్యాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న జైన్‌కు గురువారం బెయిల్ తిరస్కరించింది ఢిల్లీ హైకోర్టు.
జైన్ బెయిల్ అభ్యర్థనను తిరస్కరించిన హైకోర్టు.. జైన్ సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తి అని, బయటకు వస్తే ఆధారాలను ప్రభావితం చేయొచ్చని సింగిల్ బెంచ్ ధర్మాసనం అభిప్రాయపడింది.
జైన్‌తో సంబంధం ఉన్న నాలుగు కంపెనీలకు సంబంధించిన అక్రమ లావాదేవీలకుగానూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కిందటి ఏడాది మే నెలలో ఆయన్ని అరెస్ట్ చేసింది. కిందటి ఏడాది నవంబర్‌లో ట్రయల్ కోర్టు బెయిల్ అభ్యర్థనను తోసిపుచ్చడంతో.. ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
మార్చి 21వ తేదీనే ఇరువవర్గాల వాదనలు పూర్తి కావడంతో.. తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. ఇవాళ బెయిల్ అభ్యర్థనను తోసిపుచ్చుతున్నట్లు తీర్పు వెల్లడించింది.
హవాల రూపంలో నగదు బదిలీ.. లెక్కల్లోలేని సొమ్ముతో చరాస్తుల కొనుగోలు ఆరోపణల మేరకు సీబీఐ సత్యేందర్ జైన్‌పై కేసు నమోదు చేయగా.. ఆపై ఈడీ మనీల్యాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టింది. మరోవైపు జైల్లో ఆయనకు అందిన వీఐపీ ట్రీట్‌మెంట్ వీడియోలు బయటకు రావడంతో.. తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment