మహిళను బెదిరించిన కేసులో ఆప్ ఎమ్మెల్యే ఓక్లా అమనతుల్లా ఖాన్ ను నగరపోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.
న్యూఢిల్లీ: మహిళను బెదిరించిన కేసులో ఆప్ ఎమ్మెల్యే ఓక్లా అమనతుల్లా ఖాన్ ను నగరపోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. అమనతుల్లా ఖాన్ అరెస్టుపై స్పందించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. మోదీజీ మరో ఆప్ ఎమ్మెల్యేను అరెస్టు చేశారని ట్వీట్ చేశారు.
ఈ నెల 10 తేదీన తరచూ పవర్ కట్ లు ఉంటుండటంతో అమనతుల్లా ఖాన్ కు వినతిపత్రం ఇవ్వడానికి మహిళ బాట్లాలోని ఆయన నివాసానికి వెళ్లారు. మంత్రి ఆమెను కలిసేందుకు నిరాకరించడంతో వెనుదిరిగారు. ఇంతలో మంత్రి నివాసం నుంచి బయటకు వచ్చిన ఓ యువకుడు విషయాన్ని రాజకీయం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఆమెను బెదిరించాడు. దీనిపై స్పందించిన అమనతుల్లా ఆమె తన నివాసానికి వచ్చిన విషయం తనకు తెలియదని చెప్పారు. దీంతో ఆమె దక్షిణ ఢిల్లీలోని జమీయా నగర్ పోలీసు స్టేషన్ లో మంత్రి బెదిరిస్తున్నారంటూ కేసు పెట్టారు.