వివాదంలో మరో ఆప్ ఎమ్మెల్యే | MLA Amanatullah Khan's video: Police register case | Sakshi
Sakshi News home page

వివాదంలో మరో ఆప్ ఎమ్మెల్యే

Published Fri, Mar 4 2016 5:08 PM | Last Updated on Tue, Oct 2 2018 6:54 PM

వివాదంలో మరో ఆప్ ఎమ్మెల్యే - Sakshi

వివాదంలో మరో ఆప్ ఎమ్మెల్యే

న్యూఢిల్లీ: ఢిల్లీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే వివాదంలో ఇరుకున్నారు. గత నెల రెడ్ ఫోర్ట్ వద్ద జరిగిన ఓ కార్యక్రమంతో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్..  ప్రధాని నరేంద్ర మోదీని అసభ్య పదజాలంతో దూషించారన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. వివేక్ గార్గ్ అనే న్యాయవాది చేసిన ఫిర్యాదు మేరకు కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 504 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఢిల్లీ పోలీసులు చెప్పారు. కాగా ఈ ఎఫ్ఐఆర్లో ఆప్ ఎమ్మెల్యే పేరును సాంకేతికంగా చేర్చలేదు. రెడ్ ఫోర్ట్ వద్ద అమానతుల్లా ఖాన్ చేసిన ప్రసంగం వీడియోను పోలీసులు పరిశీలించారు.

ఢిల్లీ బీజేపీ చీఫ్‌ సతీష్ ఉపాధ్యాయ్ పార్టీ నాయకులతో కలసి ఢిల్లీ పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ను కలసి.. అమానతుల్లా ఖాన్పై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. అమానతుల్లా ఖాన్ ప్రసంగం వీడియోను కమిషనర్కు అందజేసి ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా అమానతుల్లా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement