నన్ను అరెస్టు చేయండి.. అబ్బే ఇప్పుడే కాదు | mla amanatullah khan asks to arrest self, police denies | Sakshi
Sakshi News home page

నన్ను అరెస్టు చేయండి.. అబ్బే ఇప్పుడే కాదు

Published Mon, Sep 19 2016 11:50 AM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

నన్ను అరెస్టు చేయండి.. అబ్బే ఇప్పుడే కాదు - Sakshi

నన్ను అరెస్టు చేయండి.. అబ్బే ఇప్పుడే కాదు

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ స్వయంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి తనను అరెస్టు చేయమంటే.. పోలీసులు మాత్రం ఇప్పుడే కాదంటూ ఆయన్ను తిప్పి పంపేశారు. ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధిస్తున్నారని, చివరకు లిఫ్టులో కూడా వదల్లేదని ఆయన బావమరిది భార్యే ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆయనను తాము ఇప్పుడే అరెస్టు చేయబోమని, ముందుగా తమ దర్యాప్తు పూర్తి కావాల్సి ఉందని.. ఆ తర్వాతే ఎలాంటి చర్యలైనా ఉంటాయని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

తనను అరెస్టు చేయాలంటూ పోలీసులపై తీవ్ర ఒత్తిడి ఉందని, అయితే.. అరెస్టు చేయొద్దంటూ ప్రజల నుంచి కూడా ఒత్తిడి రావడం వల్లే ఇప్పుడు వాళ్లు అరెస్టు చేయలేదని ఎమ్మెల్యే ఖాన్ చెప్పారు. ఆయన ఆరోపణలను సీనియర్ పోలీసు అధికారులు ఖండించారు. భారీ ఎత్తున మద్దతుదారులను తీసుకుని జామియా నగర్ పోలీసు స్టేషన్‌కు వెళ్లిన ఎమ్మెల్యే.. తనను అరెస్టు చేయాలని పోలీసులను కోరారు. అయితే తనపై పెట్టినది తప్పుడు కేసు కావడం వల్లే ప్రజల ఒత్తిడి ఎక్కువగా ఉందని.. అందుకే అరెస్టుచేయలేదని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement