ఢిల్లీని పరిపాలిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా మరో ఆప్ ఎమ్మెల్యే అరెస్టయ్యారు.
న్యూఢిల్లీ: ఢిల్లీని పరిపాలిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా మరో ఆప్ ఎమ్మెల్యే అరెస్టయ్యారు. లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. ఒఖ్లా నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన ఖాన్ పై ఆయన మరదలు జామియా నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనపై ఖాన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, శారరీక సంబంధం పెట్టుకోమని ఆయన తనను బలవంత పెట్టాడని ఫిర్యాదులో పేర్కొంది.
సాకేత్ కోర్టులో ఆమె వాంగ్మూలం కూడా ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు అమానతుల్లా ఖాన్ ను అరెస్టు చేశారు. ఈ కేసు నేపథ్యంలో అమానతుల్లా ఖాన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించారు. ఇప్పటికే ఢిల్లీ మంత్రి సందీప్ కుమార్ మహిళలతో రాసలీలలు జరుపుతున్న అశ్లీల వీడియో సీడీ వెలుగుచూడటంతో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.