amanatullah Khan
-
ఢిల్లీ వక్ఫ్ బోర్డు కేసు: ఆప్ నేత అమానతుల్లా ఖాన్‌కు బెయిల్
ఢిల్లీ: ఢిల్లీ వక్ఫ్ బోర్డు మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు అమానతుల్లా ఖాన్‌కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అమానతుల్లా ఖాన్, ఇతరులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవడానికి కోర్టు నిరాకరించింది. వెంటనే అమానతుల్లాను జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.ఇక..ఆయనపై విచారణ జరపడానికి అవసరమైన అనుమతి లభించలేదని పేర్కొంది. సప్లిమెంటరీ చార్జిషీట్లో పేరున్న మరియం సిద్ధిఖీపై కేసును కొనసాగించడానికి ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. అమానతుల్లా ఖాన్‌కు వ్యతిరేకంగా తగిన సాక్ష్యాలు ఉన్నాయని కోర్టు అంగీకరించగా, అవసరమైన అనుమతులు లేకుండా విచారణ కొనసాగదని కోర్టు తెలిపింది. అవసరమైన అనుమతి పొందిన తర్వాత, ఛార్జ్ షీట్‌ను పరిగణలోకి తీసుకోవచ్చని పేర్కొంది. -
మనీలాండరింగ్ కేసు: ఆప్ ఎమ్మెల్యేకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
ఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సెప్టెబర్ 23వరకు 14 రోజుల జ్యుడీషల్ కస్టడీ విధించింది. అమానతుల్లా ఖాన్ ఢిల్లీ వక్ఫ్‌బోర్డ్‌లో నియామకాలు, ఆ సంస్థకు చెందిన రూ.100 కోట్లు విలువ చేసే ఆస్తుల లీజుకు సంబంధించి అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎందుర్కొంటున్నారు. ఇక.. ఈ వ్యవహారానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం ఈడీ అమానతుల్లా ఖాన్‌ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరించింది. అమానతుల్లా ఖాన్ని విడుదల చేస్తే ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేసి అకాశం ఉందని ఈడీ కోర్టుకు తెలిపింది. దీంతో విచారణకు ఆటంకం కలుగుతుందని ఆయన్ను 14 రోజలు జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోర్టును కోరింది. ఈడీ అభ్యర్థను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఆప్ ఎమ్మెల్యేకు సెప్టెంబర్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.సెప్టెంబర్ 2వ తేదీన ఉదయం నుంచే ఆప్ ఎమ్మెల్యే నివాసంపై ఈడీ సోదాలు చేపట్టింది. సుమారు ఆరు గంటలు సోదాలు చేసిన అనంతరం ఈడీ అధికారులు అమానతుల్లా ఖాన్ అరెస్ట్ చేశారు. -
బెజవాడను ముంచేసిన బుడమేరు! ముంపులోనే పలు కాలనీలు.. ఇంకా ఇతర అప్డేట్స్..
-
ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు ఊరట.. బెయిల్ మంజూరు
ఢిల్లీ: అమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ అక్రమాల కేసులో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.15 వేల పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసినట్లు హైకోర్టు తెలిపింది. ఇటీవల ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ అక్రమాల కేసులో ఆప్ ఎమ్మెల్యేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.ఇక.. గత ఏడాది అక్టోబర్‌లో ఆప్ నేత అమానతుల్లా ఖాన్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు చేపట్టింది. అమానతుల్లా ఖాన్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఢిల్లీ వక్ఫ్ బోర్డులో అక్రమ నియామకాలకు పాల్పడిన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.ఇప్పటికే ఆయనపై ఏసీబీ, సీబీఐ రెండు ఎఫ్ఐఆర్లను దాఖలు చేశాయి. చట్ట వ్యతిరేకంగా ఇప్పటి వరకు 32 మందిని నియమించారంటూ ఎఫ్ఐఆర్లో నమోదు అయింది. గతంలో కూడా అక్రమ నియామకాలకు పాల్పడ్డారని అనుమానిస్తూ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను ఏసీబీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. -
ఆప్ ఎమ్మెల్యే, సహచరుల ఇళ్లపై ఎసీబీ దాడులు.. భారీగా నగదు, ఆయుధాలు స్వాధీనం
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్, అతని సహచరులకు చెందిన పలు ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసు విభాగం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) శుక్రవారం దాడులు నిర్వహించింది. 2020లో ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఉద్యోగాల భర్తీలో జరిగిన అవకతవకలపై ఏసీబీ విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు సంబంధించి రెండేళ్లనాటి అవినీతి కేసులో ఓక్లా నియోజకవర్గ ఎమ్మెల్యే అనమతుల్లా ఖాన్‌ను ఏసీబీ శుక్రవారం ప్రశ్నించింది. ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్, అతని వ్యాపార భాగస్వామి హమీద్ అలీఖాన్ మసూద్ ఉస్మాన్‌కు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో ఎమ్మెల్యే సహచరుడి నుంచి అక్రమంగా కలిగి ఉన్న ఓ పిస్తోల్, బుల్లెట్లు, 12 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆప్ కార్యకర్త, అమానతుల్లా ఖాన్‌కు సన్నిహితుడు అయిన కౌసర్ ఇమామ్ సిద్ధిఖీ వద్ద నుంచి రూ. 12 లక్షల రూపాయల నగదుతో పాటు ఆయుధం, కొన్ని కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: Delhi Liquor Scam: 18 కంపెనీలతోపాటు 12 మందికి ఈడీ నోటీసులు -
అతడి భార్యకు 5 లక్షల నష్ట పరిహారం
రాంచి : జార్ఖండ్ మూకదాడిలో మృతి చెందిన తబ్రేజ్ అన్సారీ కుంటుబానికి రూ. 5 లక్షల నష్ట పరిహారం అందజేస్తామని ఢిల్లీ వక్ఫ్ బోర్డు చైర్మన్, ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ గురువారం ప్రకటించారు. మృతుడి భార్యకు ఈ మొత్తాన్ని ఇస్తామన్నారు. తబ్రేజ్ అన్సారీ భార్యకు ఢిల్లీ వక్ఫ్ బోర్డులో ఉద్యోగంతో పాటు న్యాయ సహాయం అందించనున్నట్టు తెలిపారు. గతవారం జార్ఖండ్‌లోని సెరైకేలా ఖర్సావన్ జిల్లాలో తబ్రేజ్ అన్సారీని దొంగగా భావించి కొంతమంది అతన్ని స్తంభానికి కట్టేసి కర్రలతో చితకబాదుతూ మూకదాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జై శ్రీరామ్’, ‘జై హనుమాన్’ నినాదాలు చేయాలంటూ తబ్రేజ్‌పై అల్లరి మూక దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం రాజ్యసభలో స్పందించారు. ఈ మూకదాడి తనను బాధించిందన్నారు. దాడి చేసిన నేరస్తులను కఠినంగా శిక్షిస్తామన్నారు. ప్రతిపక్షాలు ఈ ఘటనను ఆసరాగా తీసుకొని జార్ఖండ్ ‘మూకదాడులకు నిలయం’ అంటూ విమర్శించడం సరికాదన్నారు. జార్ఖండ్ రాష్ట్రాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదని తెలిపారు. ఈ ఘటనలో 11 మందిని అరెస్టు చేసి దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేశారు. -
‘బీజేపీ అధ్యక్షుడిని నెట్టివేయలేదు’
న్యూఢిల్లీ: యమునా నదిపై నిర్మించిన సిగ్నేచర్ బ్రిడ్జి ప్రారంభోత్సవం బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ల మధ్య వివాదానికి కేంద్రంగా మారింది. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ, ఆప్‌ల నాయకులు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి వెళ్లిన తనను అమానతుల్లా ఖాన్ తనను నెట్టివేసాడని పార్లమెంట్ సభ్యుడు, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ ఆరోపించారు. తివారీ వ్యాఖ్యలపై స్పందిచిన ఖాన్ ఆ వ్యాఖ్యలను ఖండించారు. తివారీ స్టేజ్ ఎక్కేందుకు ప్రయత్నించగా తాను అడ్డుకున్నట్టు తెలిపారు. అంతేకానీ అతన్ని నెట్టివేయలేదని వెల్లడించారు. ఒకవేళ తివారీ స్టేజ్‌పైకి వెళితే.. అతను సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాలతో అమర్యాదగా ప్రవర్తించేవారని.. అతని చర్యలు అనుమానించేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి తివారీని ఆహ్వానించలేదని ఆయన తెలిపారు. కానీ సిగ్నేచర్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ఆయన తన అనుచరులతో వచ్చారని అన్నారు. అక్కడికి చేరుకున్న బీజేపీ కార్యకర్తలు ఆప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు.. తమ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. తివారీ స్టేజ్‌కు సమీపంలోకి వచ్చినా పోలీసులు అతన్ని అడ్డుకోలేదని ఖాన్ అన్నారు. అంతకుముందు ఈ ఘర్షణపై తివారీ స్పందిస్తూ.. సిగ్నేచర్ బ్రిడ్జి ప్రారంభ కార్యక్రమంలో అమానతుల్లా ఖాన్ తనను నెట్టివేసాడని ఆరోపించారు. ఇదంతా సీఎం కేజ్రీవాల్ సమక్షంలోనే జరిగిందని అన్నారు. ఖాన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఇది తన నియోజకవర్గంలో(ఈశాన్య ఢిల్లీ) జరగుతున్న కార్యక్రమం అని.. చాలా కాలంగా ఆగిపోయిన బ్రిడ్జి పనులను తానే తిరిగి ప్రారంభించానని అన్నారు. ఈ వివాదంపై కేజ్రీవాల్ ట్విటర్లో ఘాటుగా స్పందించారు. గతంలో ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదని అన్నారు. బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో గందరగోళం సృష్టించారని ఆరోపించారు. ఇది ఢిల్లీ ప్రభుత్వ కార్యక్రమం అని తెలిపారు. ఇక్కడ ఘర్షణ జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని విమర్శించారు. ఢిల్లీ పోలీసులను పర్యవేక్షించే లెఫ్టినెంట్ గవర్నర్‌పై శాంతి, భద్రతలను కాపాడాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. -
‘ఆప్’లో పోస్టర్ పోరు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి ఇక్కట్లు తీరేలా లేవు. ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు, కుమార్‌విశ్వాస్‌కు మధ్య ఇంకా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అమానతుల్లా పోస్టర్‌తో ఇద్దరి మధ్య వైరం మరోసారి వార్తల్లోకి వచ్చింది. అమానతుల్లాను విధాన సభ కమిటీల్లో చాలా వాటిలో సభ్యున్ని, చైర్మన్‌ను చేసినందుకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు అభివాదాలు తెలుపుతూ ఆప్ కార్యాలయంలో పోస్టర్లు వెలిశాయి. జోహరీ హీ కర్తా హై హీరోంకా పహచాన్ (రత్నాల వ్యాపారే వజ్రాలను గుర్తిస్తాడు) అంటూ ఓఖ్లా ఎమ్మెల్యే అమానతుల్లాను కేజ్రీవాల్‌కు అత్యంత ప్రియమైన ఎమ్మెల్యేగా ఈ పోస్టర్లు పేర్కొన్నాయి. అమానతుల్లా పోస్టర్లను శనివారం ఉదయం అతికించారు. రాజస్థాన్ ఇన్చార్జి హోదాలో కుమార్ విశ్వాస్ ఆప్ కార్యాలయంలో తొలి సమావేశం శనివారం జరుపనుండగా ఈ పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్ల గురించి టీవీ చానెళ్లలో వార్తలు రావడంతో కుమార్ విశ్వాస్ ఆప్ కార్యాలయానికి రాకమునుపే వాటిని తొలగించారు. దీనిపై అమానుతుల్లా అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అనుమతి లేకుండా అమానుతుల్లా పోస్టర్లను ఎలా తొలగిస్తారంటూ ఆప్ కార్యాలయ సిబ్బందిపై మండిపడ్డారు. దీనిపై సీఎం కేజ్రీవాల్‌కు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. కుమార్‌విశ్వాస్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పార్టీలో కష్టపడి పనిచేసే వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని అమానుతుల్లా అనుచరులు ఆరోపించారు. ఈ పోస్టర్లపై కుమార్ విశ్వాస్ను ప్రశ్నించగా సమాధానం దాటవేశారు. ఆ సంగతే తనకు తెలియదని వ్యాఖ్యానించారు. ఎమ్సీడీ ఎన్నికల్లో ఆప్ ఓటమి తరువాత కుమార్ విశ్వాస్ను ఆర్ఎస్ఎస్ ఏజెంట్‌గా అమానతుల్లా ఖాన్ పేర్కొన్నారు. ఆప్‌ను అధికారం నుంచి దించేందుకు కుమార్ విశ్వాస్ బీజేపీతో కలిసి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలతో ఆగ్రహించిన కుమార్ విశ్వాస్ను మెప్పించడం కోసం అమానతుల్లాను ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. -
చీపురు పార్టీలో భారీ సంక్షోభం!
-
చీపురు పార్టీలో భారీ సంక్షోభం!
ఆప్‌కు కుమార్ విశ్వాస్ రాంరాం! న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాభవం నేపథ్యంలో భగ్గుమన్న అంతర్గత అసమ్మతి అధికార ఆమ్ ఆద్మీ పార్టీని కుదిపేస్తూనే ఉంది. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంపై అసమ్మతి సెగలు ఎగిసిపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అసమ్మతి తీరంలో చేరిన ఆప్ కీలక నేత కుమార్ విశ్వాస్ సైతం ఇక కేజ్రీవాల్‌కు రాంరాం చెప్పాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కుమార్ విశ్వాస్ బీజేపీ ఏజెంట్ అని, ఆప్‌లో చీలిక తెచ్చేందుకు అతన్ని బీజేపీ, ఆరెస్సెస్ వాడుకుంటున్నాయని ఆ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ బాహాటంగా విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ విమర్శలు ఖండించకపోగా.. ఎవరూ బహిరంగ ప్రకటనలు చేయవద్దంటూ సీఎం కేజ్రీవాల్ ఆదేశించారు. అయితే, అధినేత కేజ్రీవాల్ తీరుపై కుమార్ విశ్వాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ విమర్శించినట్టు తాను బీజేపీ ఏజెంటును కాదని, తాను ఎవరికీ క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. 24గంటల్లోనే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ నివాసంలో ఆప్ అగ్రనేతలు భేటీ అయ్యారు. కుమార్ వ్యవహారంపై చర్చించినట్టు సమాచారం. కాగా, పార్టీకి వ్యతిరేకంగా బహిరంగ ప్రకటనలు చేస్తున్న కుమార్ విశ్వాస్‌పై సీనియర్ నేత మనీష్ సిసోడియా మండిపడ్డారు. సమస్య ఏమైనా ఉంటే పార్టీలో చర్చించుకొని పరిష్కరించుకోవాలని ఆయన హితవు పలికారు. ఆయనను పార్టీ నుంచి తొలగించే అవకాశం కూడా ఉందని వినిపిస్తోంది. మొత్తానికి రోజురోజుకు ఆప్ నాయకత్వానికి వ్యతిరేకంగా సొంత పార్టీలోనే అసమ్మతి గళాలు ఎగిసిపడుతున్నాయి. -
ఆప్‌లో లుకలుకలు, సిసోడియాతో కేజ్రీవాల్ భేటీ
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో పరాజయం మూటగట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీలో లుకలుకలు కొనసాగుతున్నాయి. ఆ పార్టీలో కుమార్ విశ్వాస్ వ్యవహారం ముగిసిపోకముందే...తాజాగా ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ పేరు తెర మీదకు వచ్చింది.ఆప్‌ను చీల్చేందుకు అమానతుల్లా ఖాన్ కుట్ర పన్నుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. 40మంది ఎమ్మెల్యేలు అతనిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే పీఏసీ అధ్యక్ష పదవి నుంచి అమానతుల్లా ఖాన్ ను తొలగించాలంటూ వారు ఈ సందర్భంగా సీఎంకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆప్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో అత్యవసరంగా భేటీ అయ్యారు. పార్టీలో తాజా పరిణామాలపై చర్చలు జరుపుతున్నారు. కాగా పార్టీ వ్యవస్థాపకులలో ఒకరైన ఎమ్మెల్యే కుమార్ విశ్వాస్ కూడా చేజారిపోతున్నట్లు సంకేతాలతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకుని మరీ కుమార్ విశ్వాస్ బీజేపీలో చేరుతారని పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే కుమార్ విశ్వాస్ తన సోదరుడి లాంటివాడంటూ కొంతమంది వ్యక్తులు తామిద్దరి మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని వాళ్లు పార్టీకి శత్రువులని సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేశారు. -
ఆప్ ఎమ్మెల్యేకు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు గురువారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తనతో సంబంధం పెట్టుకోవాలని ఎమ్మెల్యే ఒత్తిడికి గురి చేస్తున్నాడంటూ ఆయన బావమరిది భార్య ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో ఖాన్‌ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరిచారు. దీంతో ఎమ్మెల్యేకు ఒక్కరోజు పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. మరోవైపు ఎమ్మెల్యే తరఫు న్యాయవాది బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా, ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. కాగా తనపై ఆరోపణలతో ఎమ్మెల్యే అమానతుల్లా ఆదివారం జమియా నగర్ పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోవడానికి ప్రయత్నించారు. అయితే ఆయనను తమ దర్యాప్తు ప్రకారమే అరెస్టు చేస్తామని పోలీసులు అక్కడి నుంచి పంపించి వేశారు. -
లైంగిక వేధింపులు.. మరో ఎమ్మెల్యే అరెస్టు!
న్యూఢిల్లీ: ఢిల్లీని పరిపాలిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా మరో ఆప్ ఎమ్మెల్యే అరెస్టయ్యారు. లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. ఒఖ్లా నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన ఖాన్ పై ఆయన మరదలు జామియా నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనపై ఖాన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, శారరీక సంబంధం పెట్టుకోమని ఆయన తనను బలవంత పెట్టాడని ఫిర్యాదులో పేర్కొంది. సాకేత్ కోర్టులో ఆమె వాంగ్మూలం కూడా ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు అమానతుల్లా ఖాన్ ను అరెస్టు చేశారు. ఈ కేసు నేపథ్యంలో అమానతుల్లా ఖాన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించారు. ఇప్పటికే ఢిల్లీ మంత్రి సందీప్ కుమార్ మహిళలతో రాసలీలలు జరుపుతున్న అశ్లీల వీడియో సీడీ వెలుగుచూడటంతో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
నన్ను అరెస్టు చేయండి.. అబ్బే ఇప్పుడే కాదు
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ స్వయంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి తనను అరెస్టు చేయమంటే.. పోలీసులు మాత్రం ఇప్పుడే కాదంటూ ఆయన్ను తిప్పి పంపేశారు. ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధిస్తున్నారని, చివరకు లిఫ్టులో కూడా వదల్లేదని ఆయన బావమరిది భార్యే ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆయనను తాము ఇప్పుడే అరెస్టు చేయబోమని, ముందుగా తమ దర్యాప్తు పూర్తి కావాల్సి ఉందని.. ఆ తర్వాతే ఎలాంటి చర్యలైనా ఉంటాయని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. తనను అరెస్టు చేయాలంటూ పోలీసులపై తీవ్ర ఒత్తిడి ఉందని, అయితే.. అరెస్టు చేయొద్దంటూ ప్రజల నుంచి కూడా ఒత్తిడి రావడం వల్లే ఇప్పుడు వాళ్లు అరెస్టు చేయలేదని ఎమ్మెల్యే ఖాన్ చెప్పారు. ఆయన ఆరోపణలను సీనియర్ పోలీసు అధికారులు ఖండించారు. భారీ ఎత్తున మద్దతుదారులను తీసుకుని జామియా నగర్ పోలీసు స్టేషన్‌కు వెళ్లిన ఎమ్మెల్యే.. తనను అరెస్టు చేయాలని పోలీసులను కోరారు. అయితే తనపై పెట్టినది తప్పుడు కేసు కావడం వల్లే ప్రజల ఒత్తిడి ఎక్కువగా ఉందని.. అందుకే అరెస్టుచేయలేదని ఆయన అన్నారు. -
ఆ ఎమ్మెల్యే.. లిఫ్టులోనూ వదల్లేదు!
ఆమ్ ఆద్మీ పార్టీ తమ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను ఎంత వెనకేసుకుని వస్తున్నా.. ఆయన మీద కేసు పీటముడి మాత్రం రోజురోజుకూ మరింత బిగుసుకుంటోంది. గడిచిన ఏడాదిన్నరలో తనమీద కనీసం ఐదుసార్లు ఆయన లైంగిక దాడి చేశాడని ఎమ్మెల్యే బావమరిది భార్య కోర్టులో వెల్లడించారు. చివరకు ఒకసారి లిఫ్టులో కూడా తనపై అఘాయిత్యం చేశాడని ఆమె తెలిపారు. తన భర్త సమక్షంలో కూడా పలుమార్లు తనవద్దకు వచ్చాడని, దీనిపై తన భర్తకు ఫిర్యాదుచేస్తే.. ఎమ్మెల్యే తనకు వ్యాపారంలో సాయం చేస్తున్నారు కాబట్టి ఆయన ఎలా చెబితే అలా నడుచుకోవాలన్నాడని కోర్టుకు ఒక ప్రకటన ద్వారా చెప్పారు. తనకు, ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు మధ్య జరిగిన సంభాషణల రికార్డింగుతో కూడిన ఒక సీడీ, పెన్‌డ్రైవ్‌ను కూడా ఆమె పోలీసులకు ఇచ్చారు. తాను గడిచిన నాలుగు నెలలుగా భర్తతో గొడవల వల్ల ఢిల్లీలోని షహీన్ బాగ్ ప్రాంతంలో ఒక అద్దె ఇంట్లో ఉంటున్నట్లు చెప్పారు. తాను ఇప్పటికే విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశానని, కూతురిని చదివించుకోడానికి ఒక బొటిక్ నడిపించుకుంటున్నానని అన్నారు. గత శుక్రవారం రాత్రి నుంచి ఎమ్మెల్యే మనుషులు తనను బెదిరిస్తున్నారని, అందువల్ల పోలీసు రక్షణ కల్పించాలని కోరారు. ఆమె ఫిర్యాదు మేరకు ఆమె భర్తతో పాటు ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌పై 354ఎ (లైంగిక వేధింపు), 506 (నేరపూరితంగా బెదిరించడం), 509 (మహిళ మర్యాదను కించపరిచే చేష్టలు, మాటలు), 120బి (నేరపూరిత కుట్ర), 498ఎ (భర్త లేదా అతడి బంధువులు మహిళపట్ల క్రూరంగా వ్యవహరించడం) సెక్షన్ల కింద కేసులు పెట్టారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలు మాత్రం తమ ఎమ్మెల్యే చాలా మంచివాడని, నిర్దోషి అని అంటున్నారు. అతడు పార్టీ పదవులకు చేసిన రాజీనామాలను తిరస్కరించడమే కాక.. అతడికి అండగా నిలుస్తామని కూడా చెప్పారు. మరి ఇప్పుడు కోర్టులో ఆమె వాంగ్మూలం తర్వాత ఏమంటారో చూడాలి. -
ఆమెతో మా ఎమ్మెల్యేకు సంబంధం లేదు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, ఢిల్లీ వక్ఫ్ బోర్డు చీఫ్ అమనతుల్లా ఖాన్ అన్ని పదవులకు చేసిన రాజీనామాను ఆ పార్టీ తిరస్కరించింది. ప్రజలకు సేవ చేస్తుంటే తనను, తన కుటుంబాన్ని అనవసరంగా వివాదాల్లోకి లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గత నాలుగేళ్లుగా అమనతుల్లా తనను లైంగికంగా వేధిస్తున్నారని ఆయన బావమరిది భార్య జామియా నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా స్పందిస్తూ.. 'అమనతుల్లాపై వచ్చిన ఫిర్యాదులోని వాస్తవాలను పరిశీలించాం. ఆయన బావమరిది మాజీ భార్య ఫిర్యాదు చేసింది. అమనతుల్లా బావమరిది నాలుగేళ్లుగా భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఆమెతో అమనతుల్లాకు ఎలాంటి సంబంధం లేదు. కుటుంబంలోని వివాదాల వల్లే అమనతుల్లా పేరును కేసులోకి లాగారు. మా పార్టీలో ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టం. అయితే దురుద్దేశపూర్వకంగా వారిపై కేసులు పెడితే అండగా ఉంటాం. ఈ వివరాలను సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు, పార్టీ సీనియర్ నేతలకు చెప్పాను. అమనతుల్లా రాజీనామాలను తిరస్కరించాలని నిర్ణయించాం' అని చెప్పారు. -
ఆప్ ఎమ్మెల్యేపై లైంగికదాడి కేసు
-
ఆప్ ఎమ్మెల్యేపై లైంగికదాడి కేసు
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను కష్టాలు వీడటం లేదు. పార్టీ పరంగా వచ్చిన అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ఇలా ప్రకటించారో లేదో.. ఆయనపై జామియా నగర్ పోలీసు స్టేషన్లో లైంగిక దాడి కేసు నమోదైంది. ఆ ఫిర్యాదు ఇచ్చింది కూడా ఎవరో కాదు.. సాక్షాత్తు ఖాన్ బావమరిది భార్యే!! గత నాలుగేళ్లుగా అమానతుల్లా తనను లైంగికంగా వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో అమానతుల్లాతో పాటు ఆయన బావమరిదిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. తనతో సంబంధం పెట్టుకోవాల్సిందిగా ఆమానతుల్లా ఒత్తిడి చేసేవారని, తన అత్తమామలు వరకట్నం కోసం తరచు చిత్రహింసలు పెట్టేవారని కూడా బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్త సైతం.. అమానతుల్లాతో వివాహేతర సంబంధం పెట్టుకోవాల్సిందిగా ఒత్తిడి చేసేవాడని తెలిపారు. ఆమె చేసిన ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసుతో ఆమ్ ఆద్మీ పార్టీ మీద మరో పెద్ద మచ్చ పడినట్లయింది. పార్టీకి రాజీనామా చేస్తున్నానంటూ అమానతుల్లా ఖాన్ పార్టీ అధినేత కేజ్రీవాల్‌కు లేఖ ఇచ్చిన కొద్ది సేపటి తర్వాతే ఈ ఫిర్యాదు విషయం వెలుగులోకి వచ్చింది. తనపై వస్తున్న వివిధ ఆరోపణలకు వివరణలు ఇచ్చుకోలేక తాను అలసిపోయానని ఖాన్ అన్నారు. తాను ఎన్నికైన రోజు నుంచి ఢిల్లీ ప్రజలకు సంపూర్ణ నిబద్ధతతో సేవలు చేశానని తెలిపారు. ఢిల్లీ వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా నియమితుడినైన వెంటనే పాత ప్రభుత్వంలో జరిగిన అనేక అవినీతి విషయాలను వెలుగులోకి తెచ్చానని, కానీ తన నిజాయితీ కొందరికి నచ్చలేదని అన్నారు. అందుకే తనపైన, తన కుటుంబ సభ్యులపైన తప్పుడు కేసులు పెడుతున్నారని వాపోయారు. -
వివాదంలో మరో ఆప్ ఎమ్మెల్యే
న్యూఢిల్లీ: ఢిల్లీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే వివాదంలో ఇరుకున్నారు. గత నెల రెడ్ ఫోర్ట్ వద్ద జరిగిన ఓ కార్యక్రమంతో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్.. ప్రధాని నరేంద్ర మోదీని అసభ్య పదజాలంతో దూషించారన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. వివేక్ గార్గ్ అనే న్యాయవాది చేసిన ఫిర్యాదు మేరకు కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 504 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఢిల్లీ పోలీసులు చెప్పారు. కాగా ఈ ఎఫ్ఐఆర్లో ఆప్ ఎమ్మెల్యే పేరును సాంకేతికంగా చేర్చలేదు. రెడ్ ఫోర్ట్ వద్ద అమానతుల్లా ఖాన్ చేసిన ప్రసంగం వీడియోను పోలీసులు పరిశీలించారు. ఢిల్లీ బీజేపీ చీఫ్ సతీష్ ఉపాధ్యాయ్ పార్టీ నాయకులతో కలసి ఢిల్లీ పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్‌ను కలసి.. అమానతుల్లా ఖాన్‌పై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. అమానతుల్లా ఖాన్ ప్రసంగం వీడియోను కమిషనర్‌కు అందజేసి ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా అమానతుల్లా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.