ఆప్‌ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు ఊరట.. బెయిల్‌ మంజూరు | delhi HC grants bail AAP MLA Amanatullah Khan Waqf Board case | Sakshi
Sakshi News home page

ఆప్‌ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు ఊరట.. బెయిల్‌ మంజూరు

Published Sat, Apr 27 2024 2:19 PM | Last Updated on Sat, Apr 27 2024 2:19 PM

delhi HC grants bail AAP MLA Amanatullah Khan Waqf Board case

ఢిల్లీ: అమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ అక్రమాల కేసులో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.15 వేల పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసినట్లు హైకోర్టు తెలిపింది. ఇటీవల ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ అక్రమాల కేసులో ఆప్ ఎమ్మెల్యేను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ ) అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

ఇ​​​క.. గత ఏడాది అక్టోబర్‌లో ఆప్‌ నేత అమానతుల్లా ఖాన్‌ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోదాలు చేపట్టింది. అమానతుల్లా ఖాన్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఢిల్లీ వక్ఫ్‌ బోర్డులో అక్రమ నియామకాలకు పాల్పడిన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఇప్పటికే ఆయనపై ఏసీబీ, సీబీఐ రెండు ఎఫ్‌ఐఆర్‌లను దాఖలు చేశాయి. చట్ట వ్యతిరేకంగా ఇప్పటి వరకు 32 మందిని నియమించారంటూ ఎఫ్‌ఐఆర్‌లో నమోదు అయింది. గతంలో  కూడా అక్రమ నియామకాలకు పాల్పడ్డారని అనుమానిస్తూ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను ఏసీబీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement