ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను కష్టాలు వీడటం లేదు. పార్టీ పరంగా వచ్చిన అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ఇలా ప్రకటించారో లేదో.. ఆయనపై జామియా నగర్ పోలీసు స్టేషన్లో లైంగిక దాడి కేసు నమోదైంది. ఆ ఫిర్యాదు ఇచ్చింది కూడా ఎవరో కాదు.. సాక్షాత్తు ఖాన్ బావమరిది భార్యే!! గత నాలుగేళ్లుగా అమానతుల్లా తనను లైంగికంగా వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో అమానతుల్లాతో పాటు ఆయన బావమరిదిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.