ఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సెప్టెబర్ 23వరకు 14 రోజుల జ్యుడీషల్ కస్టడీ విధించింది. అమానతుల్లా ఖాన్ ఢిల్లీ వక్ఫ్‌బోర్డ్‌లో నియామకాలు, ఆ సంస్థకు చెందిన రూ.100 కోట్లు విలువ చేసే ఆస్తుల లీజుకు సంబంధించి అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎందుర్కొంటున్నారు. ఇక.. ఈ వ్యవహారానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయన్ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
తాజాగా సోమవారం ఈడీ అమానతుల్లా ఖాన్‌ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరించింది. అమానతుల్లా ఖాన్‌ని విడుదల చేస్తే ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేసి అకాశం ఉందని ఈడీ కోర్టుకు తెలిపింది. దీంతో విచారణకు ఆటంకం కలుగుతుందని ఆయన్ను 14 రోజలు జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోర్టును కోరింది. ఈడీ అభ్యర్థను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఆప్ ఎమ్మెల్యేకు సెప్టెంబర్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
సెప్టెంబర్ 2వ తేదీన ఉదయం నుంచే ఆప్ ఎమ్మెల్యే నివాసంపై ఈడీ సోదాలు చేపట్టింది. సుమారు ఆరు గంటలు సోదాలు చేసిన అనంతరం ఈడీ అధికారులు అమానతుల్లా ఖాన్ అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment