న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్, అతని సహచరులకు చెందిన పలు ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసు విభాగం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) శుక్రవారం దాడులు నిర్వహించింది. 2020లో ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఉద్యోగాల భర్తీలో జరిగిన అవకతవకలపై ఏసీబీ విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు సంబంధించి రెండేళ్లనాటి అవినీతి కేసులో ఓక్లా నియోజకవర్గ ఎమ్మెల్యే అనమతుల్లా ఖాన్‌ను ఏసీబీ శుక్రవారం ప్రశ్నించింది.
ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్, అతని వ్యాపార భాగస్వామి హమీద్ అలీఖాన్ మసూద్ ఉస్మాన్‌కు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో ఎమ్మెల్యే సహచరుడి నుంచి అక్రమంగా కలిగి ఉన్న ఓ పిస్తోల్, బుల్లెట్లు, 12 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆప్ కార్యకర్త, అమానతుల్లా ఖాన్‌కు సన్నిహితుడు అయిన కౌసర్ ఇమామ్ సిద్ధిఖీ వద్ద నుంచి రూ. 12 లక్షల రూపాయల నగదుతో పాటు ఆయుధం, కొన్ని కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు.
చదవండి: Delhi Liquor Scam: 18 కంపెనీలతోపాటు 12 మందికి ఈడీ నోటీసులు
Comments
Please login to add a commentAdd a comment