'నన్ను కోర్టు అరెస్టు చేస్తారు' | AAP lawmaker Amanatullah Khan to 'court arrest' | Sakshi
Sakshi News home page

'నన్ను కోర్టు అరెస్టు చేస్తారు'

Published Sun, Sep 18 2016 12:51 PM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

AAP lawmaker Amanatullah Khan to 'court arrest'

న్యూఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్ తనను ఆదివారం కోర్టు అరెస్టు చేయనున్నట్లు చెప్పారు. మహిళను వేధించిన కేసులో అమనతుల్లా విచారణలో భాగంగా కోర్టుకు హాజరవుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఓఖ్లా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన అమనతుల్లా తనను అరెస్టు చేయాలని పోలీసులపై ఒత్తిడి పెరుగుతోందని పేర్కొన్నారు.

తప్పుడు కేసులో తనను అరెస్టు చేయాలని పోలీసులు చూస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో జరుతున్న పనులను తానే స్వయంగా పర్యవేక్షిస్తుండటంతో తనను అరెస్టు చేయొద్దని పోలీసులను కోరినట్లు చెప్పారు. అందుకు సమాధానంగా తమపై ఒత్తిడి ఉందని అరెస్టు చేయక తప్పదని పోలీసులు చెప్పినట్లు వెల్లడించారు. ఆదివారం జమీయా నగర్ పోలీసు స్టేషన్లో తనను కోర్టు అరెస్టు చేస్తారని అమనతుల్లా ఖాన్ పేర్కొన్నారు. ఢిల్లీ సీనియర్ పోలీసులు అధికారులు అమనతుల్లా వ్యాఖ్యలను కొట్టిపారేశారు. ఆయనపై తాము ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం లేదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement