ఆ ఎమ్మెల్యేలు బడికే వెళ్లలేదట!
న్యూఢిల్లీ: రాజకీయ నాయకుల మాటల వెనుక అసలు నిజాలు వేరే ఉంటాయంటారు. అసలు కార్యం పూర్తయితే తప్ప ఆ విషయం బయటకు రాదు.. రానివ్వరు అని చెబుతుంటారు. ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో ఇది కాస్త రుజువైంది. తమ పార్టీ నేతలంతా బాగా చదువర్లు, ఉన్నత చదువులు చదివిన వాళ్లు.. ఎంబీఏ, ఇంజినీరింగ్ అని పేర్కొంటూ వివిధ రంగాల్లో కూడా ఆరితేరిన వారని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పిన మాటలన్ని కల్లలే అని తెలిసిపోయింది. ఎందుకంటే.. ఆయన ఎమ్మెల్యేల్లో మొత్తం 23 మంది కేవలం స్కూల్ స్థాయి చదువులే చదివారంట.
అది కాకుండా ఏనాడు వీరు కనీసం ఆ క్లాసులకు కూడా పూర్తిగా వెళ్లలేదని తెలిసింది. ఎన్నికల కమిషన్కు నామినేషన్ సమయాల్లో సమర్పించిన అఫిడ్ విట్ లో ఈ విషయాలు పేర్కొన్నారు. దీని ప్రకారం 20మంది ఎమ్మెల్యేలు ప్రాథమిక, మాధ్యమిక విద్యను మాత్రమే పూర్తి చేశారు. ఇక ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాతోపాటు మరో ఇద్దరు డిప్లోమా వరకు చదివారంట. 26మంది ఆప్ ఎమ్మెల్యేలో నరేశ్ బాల్యన్, హజారీ లాల్ చౌహాన్, రాజు దింగాన్, అవతార్ సింగ్ అనే నలుగురు నేతలు కేవలం 8వ తరగతి పూర్తి చేయగా మరికొందరు ఐదు, ఇంకొందరు పదో తరగతి పూర్తి చేశారని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. వీళ్లలో ఏ ఒక్కరు కూడా రెగ్యులర్గా స్కూల్కు వెళ్లేవారు కాదంట. ఈ వివరాలు బయటకు రావడంతో విలువలు, నీతి అంటూ పార్టీ పెట్టి అందరు అవాక్కయ్యేలా ప్రసంగాలు ఇచ్చిన కేజ్రీవాల్ కూడా అబద్ధాలు చెబుతారా అని సామాన్యులు ఇప్పుడు విస్తుపోతున్నారు.