సాక్షి, న్యూఢిల్లీ: రోజుకో వివాదం కారణంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) వార్తల్లో నిలుస్తుండగా, ఆ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రం పార్టీలో అంతా బాగానే ఉందని అంటున్నారు. పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని సోమవారం రాష్ట్రపతి భవన్‌కు హాజరైన కేజ్రీవాల్ విలేకరులతో మాట్లాడారు. పార్టీలో అంతా సవ్యంగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. ఏమైనా సమస్యలు ఉంటే వాటిని తాము పరిష్కరించుకుంటామని కేజ్రీవాల్ అన్నారు. అపరిషృతంగా ఉన్న అంశాలు త్వరలోనే పరిష్కారమవుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, ఈ ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా కేజ్రీవాల్‌తో మాట్లాడారు. దీని గురించి విలేకరులు ఆరా తీయగా తన ఆరోగ్యం గురించి ప్రధాని వాకబు చేశారని కేజ్రీవాల్ చెప్పారు.
అంతా బాగానే ఉంది: కేజ్రీవాల్
Published Tue, Mar 31 2015 3:41 AM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
Advertisement
Advertisement