'హనుమంతప్పకోసం ఎంతో ప్రార్థిస్తున్నాను'
న్యూఢిల్లీ: సియాచిన్ ప్రమాదంలో చిక్కుకొని ఆరు రోజులపాటు మంచుదిబ్బలకింద ఉండిపోయి చివరకు మృత్యుంజయుడిగా బయటపడి ప్రస్తుతం ప్రాణంకోసం పోరాడుతున్న లాన్స్ నాయక్ హనుమంతప్ప వీలయినంత త్వరగా కోలుకోవాలని తాను కోరుకుంటున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
ఆ వీర సైనికుడు త్వరత్వరగా కోలుకోవాలని తాను దేవుడిని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాని ఆయన చెప్పారు. 'హనుమంతప్ప కొప్పాడ్ సురక్షితంగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఈరోజు నేను ఆయనను చూసేందుకు వెళ్లాలని అనుకున్నాను. కానీ, ఇప్పుడు అతడు ఉన్న పరిస్థితుల్లో కలవడం అంతమంచిదికాదని అధికారులు సూచించారు' అని కేజ్రీవాల్ చెప్పారు.