పన్ను మినహాయింపు పరిమితి రూ.4 లక్షలకు పెంచండి
కేంద్రానికి అసోచామ్ సూచన
న్యూఢి ల్లీ: వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రానున్న బడ్జెట్‌లో రూ.4 లక్షలకు పెంచాలని పరిశ్రమ సమాఖ్య అసోచామ్ కేంద్రాన్ని కోరింది. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ప్రస్తుతం పన్ను మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలుగా ఉంది. సేవింగ్స్‌కు సంబంధించి మరిన్ని ప్రోత్సాహకాలను అందించాలని పేర్కొంది. విద్య, ఆరోగ్య రంగాలపై ప్రభుత్వ నిధుల కేటాయింపు పెరగాల్సి ఉందని తెలిపింది. అసోచామ్ ఇటీవల ‘ఆమ్ ఆద్మీ’ పేరుతో ఒక సర్వే నిర్వహించింది. ఇందులో పాల్గొన్న 87% మంది పన్ను మినహాయింపు పరిమితిని రూ.4 లక్షలకు పెంచాలనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.
నిత్యావసర జీవన ప్రమాణ ధరల పెరుగుదల నేపథ్యంలో పరిమితి పెంపు ఆవశ్యకమని అసోచామ్ పేర్కొంది. ప్రస్తుతం సెక్షన్ 80డీ ప్రకారం ఉన్న వార్షిక మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపు పరిమితిని రూ.15,000 నుంచి రూ.50,000 వరకు పెంచాలని సర్వేలో పాల్గొన్న 88 శాతం మంది అభిప్రాయపడ్డారు. పిల్లల చదువు ఖర్చుల పరిమితిని కూడా నెలకు రూ.100 నుంచి రూ.1,000 వరకు పెంచాలని అసోచామ్ పేర్కొంది. అలాగే ప్రసు ్తతం ఇద్దరి పిల్లలకు ఇస్తున్న హాస్టల్ ఖర్చుల పరి మితిని నెలకు రూ.300 నుంచి రూ.3,000 వరకు పెంచాలని తెలిపింది. ఇంటి రుణాల వడ్డీరేట్లు పెరుగుతుండటం, ప్రాపర్టీ ధరలు ఎగయడం వంటి అంశాల నేపథ్యంలో వ్యక్తిగత ప్రాపర్టీ వడ్డీరేట్ల మినహాయింపు పరిమితిని రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచాలని పేర్కొంది.