
'కులమత రాజకీయాలను తిరస్కరించారు'
కులమత రాజకీయాలను ఢిల్లీ ప్రజలు తిరస్కరించారని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.
న్యూ ఢిల్లీ: కులమత రాజకీయాలను ఢిల్లీ ప్రజలు తిరస్కరించారని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు కృతజ్క్షతలు తెలిపారు. నిస్వార్ధంగా పని చేసిన ఆప్ కార్యకర్తలను ఆయన అభినందించారు. కాగా ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ విజయభేరీ మోగించనుందని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వెల్లడించాయి. తుది ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు.