
ఎస్సీ ఎస్టీ వేధింపుల కేసులో ఎమ్మెల్యే అరెస్టు
ప్రభుత్వోద్యోగిపై దాడి చేసి, ఆయన తన విధులను నిర్వర్తించనివ్వకుండా అడ్డుకున్నందుకు, కులం పేరుతో దూషించినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే కమాండో సురేందర్ సింగ్ను పోలీసులు అరెస్టు చేశారు.
ప్రభుత్వోద్యోగిపై దాడి చేసి, ఆయన తన విధులను నిర్వర్తించనివ్వకుండా అడ్డుకున్నందుకు, కులం పేరుతో దూషించినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే కమాండో సురేందర్ సింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ దరఖాస్తును ఢిల్లీ కోర్టు తిరస్కరించడంతో.. అరెస్టు తప్పనిసరి అయ్యింది. అరెస్టు చేసిన తర్వాత ఆ ఎమ్మెల్యేను వైద్య పరీక్షల కోసం రాం మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించినట్లు ఢిల్లీ సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
గతంలో ఎన్ఎస్జీ మాజీ కమాండోగా పనిచేసిన సురేందర్ సింగ్.. ఈనెల 4వ తేదీన న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ)లోని శానిటరీ ఇన్స్పెక్టర్ ఆర్జే మీనాను తిట్టి, కొట్టారన్న ఆరోపణలున్నాయి. ఆక్రమణలను పరిశీలించేందుకు తన బృందంతో రాగా.. ఆయనతో పాటు బేల్దార్ ముఖేష్ మీద సురేందర్ సింగ్ దాడి చేశారు. ఈ రిక్షా డ్రైవర్ను పత్రాలు చూపించమన్నందుకు ఆయన ఈ దాడి చేశారని చెబుతున్నారు.
అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు అశుతోష్ మాత్రం.. మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. సీఎన్జీ ఫిట్నెస్ స్కాములో అవినీతిపరులను మోదీ ప్రభుత్వం రక్షిస్తుంది గానీ, 26/11 ఉగ్రదాడి సమయంలో బుల్లెట్లను ఎదుర్కొన్న దేశభక్తుడిని అరెస్టు చేస్తుందని ఆయన ఆరోపించారు.