ఎన్నికల సమయంలో నేతలు చేసే హామీలు ఒక్కోసారి వారి తలకు చుట్టుకుంటాయి. ఇటువంటి సందర్భాల్లో సదరు నేత ఏం చేయాలో తెలియక సతమతం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు అలాంటి సమస్యే ఎదురయ్యింది.
వివరాల్లోకి వెళితే ఢిల్లీలోని గురు హరికిషన్ పబ్లిక్ స్కూల్ ముందు వందలాది మంది మహిళలు గుమిగూడి, ఢిల్లీ సర్కారు తమకు ఇస్తామన్న వెయ్యి రూపాయలు తక్షణం ఇవ్వాల్సిందేనంటూ ఆందోళనకు దిగారు. వీరిలోని కొందరు మహిళలు తమ చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని 'కేజ్రీవాల్.. మాకు వెయ్యి రూపాయలు ఇవ్వాలి’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు తమకు వెయ్యి రూపాయలు ఇస్తామంటూ ఫారాలు నింపారని ఆ మహిళలు తెలిపారు. అసెంబ్లీలో 2024-25 బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నప్పుడు, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో 18 ఏళ్లు పైబడిన మహిళలకు ప్రతినెలా వెయ్యి రూపాయలు ఇస్తామని ప్రకటించింది. ఈ పథకానికి ‘మహిళా సమ్మాన్ రాశి యోజన’ అని పేరు పెట్టింది. ఈ పధకానికి అర్హులైవారి జాబితాను ఆప్ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి, వివరాలు తెలుసుకుని రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment