మహిళతో అసభ్య ప్రవర్తన, ఎమ్మెల్యేపై కేసు నమోదు | misbehaving with a woman:case registered against AAP MLA Prakash Jarwal | Sakshi
Sakshi News home page

మహిళతో అసభ్య ప్రవర్తన, ఎమ్మెల్యేపై కేసు నమోదు

Published Fri, Jul 8 2016 9:09 AM | Last Updated on Wed, Apr 4 2018 7:02 PM

మహిళతో అసభ్య ప్రవర్తన, ఎమ్మెల్యేపై కేసు నమోదు - Sakshi

మహిళతో అసభ్య ప్రవర్తన, ఎమ్మెల్యేపై కేసు నమోదు

న్యూఢిల్లీ : మరో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆప్ ఎమ్మెల్యే ప్రకాశ్ జార్వాల్‌పై గ్రేటర్ కైలాష్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఆయనపై ఐపీసీ 354, 506, 509 & 34 సెక్షన్ల కింద ఢిల్లీ పోలీసులు కేసు నమోదు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసిన వారి వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు.  ఆప్ సీనియర్ నేత అయిన  ప్రకాశ్ జార్వాల్ దేవ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

కాగా గతంలోనూ దురుసుగా ప్రవర్తించినందుకు ప్రకాశ్ జార్వాల్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.  కాగా 2014లో తన మాట వినలేదనే కోపంతో ఢిల్లీ జలబోర్డు అధికారిపై చేయిచేసుకున్నందుకు ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఆప్ ఎమ్మెల్యేలు పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఇటీవలే ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో ఆప్ ఎమ్మెల్యే దినేశ్ మోహనియాను అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన బెయిల్పై విడుదల అయ్యారు. తాజాగా ప్రకాశ్ జార్వాల్‌ కూడా ఓ మహిళపై పట్ల అసభ్యంగా ప్రవర్తించి కేసులో చిక్కుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement