మరో వివాదంలో ఆప్ ఎంపీ | FIR registered against AAP's Bhagwant Mann for insulting journalists | Sakshi
Sakshi News home page

మరో వివాదంలో ఆప్ ఎంపీ

Published Sat, Sep 3 2016 1:52 PM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM

మరో వివాదంలో ఆప్ ఎంపీ - Sakshi

మరో వివాదంలో ఆప్ ఎంపీ

ఆమ్ ఆద్మీ పార్టీ నేత, పంజాబ్లోని సింగ్రూర్ ఎంపీ భగవత్ మన్ సింగ్ ఏరికోరి మరీ వివాదాల్లో చిక్కుకుంటున్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ నేత, పంజాబ్లోని సింగ్రూర్ ఎంపీ భగవత్ మన్ సింగ్ ఏరికోరి మరీ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఓ సారి మద్యం సేవించి పార్లమెంట్కు రావడం... మరోసారి పార్లమెంట్ భద్రతను పణంగా పెట్టి వీడియో తీయడం.. తాజాగా జర్నలిస్టులను కించపరచడం. ఈ వివాదాలతో భగవత్ మన్ సింగ్కు ఎక్కడి లేని చిక్కులు వచ్చిపడుతున్నాయి. తాజాగా జర్నలిస్టులను కించపరిచినందుకు ఎంపీకు వ్యతిరేకంగా పంజాబ్ బాసనీ పథానా పోలీసుల స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది.  హిందీ న్యూస్పేపర్లో పనిచేసే ఓ వర్కింగ్ జర్నలిస్టుపై దురుసుగా వ్యవహరించినందుకు ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. ఆ హిందీ జర్నలిస్టు భగవత్ మన్పై ఎఫ్ఐఆర్ను నమోదుచేశారు.
 
బాసీ పథానాలోని ఫతేగఢ్ సాహిబ్లో నిర్వహించిన ర్యాలీ వెన్యూకు ఆయన ఆలస్యంగా రావడంపై జర్నలిస్టు ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు కోపోద్రుహులైన భగవత్ మన్, జర్నలిస్టుపై మీడియా ముందే దురుసుగా ప్రవర్తించారు. మీడియాను కించపరిచినట్టు మాట్లాడిన ఆప్ ఎంపీ, మీడియాను వెంటనే ర్యాలీ నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించారు.  ప్రతి జర్నలిస్టుకు ఓ రేటు ఉంటుందని, మీడియా కవరేజ్ అవసరం లేని పార్టీ ఆప్నేనని కితాబు ఇచ్చుకున్నారు. వార్తలు రాయడానికి ప్రతి జర్నలిస్టు డబ్బులు తీసుకుంటారని ఆరోపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement