ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతిపై ఆదివారం మరో కేసు నమోదయింది.
ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతిపై ఆదివారం మరో కేసు నమోదయింది. ఈ నెల 9న ఢిల్లీ ఆల్ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) భద్రతా సిబ్బందితో సోమనాథ్ తన అనుచరులతో కలిసి దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎయిమ్స్ ప్రధాన భద్రతా అధికారి(సీఎస్ఓ) ఈ మేరకు సోమనాథ్, ఆయన అనుచరులు భద్రతా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా.. ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించినట్లు హజ్ ఖాస్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఢిల్లీలోని మాల్వియా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సోమనాథ్ గతంలో గృహ హింస కేసులో అరెస్టయ్యారు. ప్రస్తుతం బెయిల్ పై ఉన్న ఆయనపై మరో కేసు నమోదయింది.