కుత్బుల్లాపూర్‌లో జర్నలిస్ట్‌ల నిరసన
గాజులరామారం: ఆంధ్రప్రదేశ్‌లో ఎంఎస్‌వోలను బెదిరించి బలవంతంగా సాక్షి ఛానల్ ప్రసారాలను అడ్డుకోవడం టీడీపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమంటూ కుత్బుల్లాపూర్‌లో మంగళవారం జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. పలు ప్రజా సంఘాల వారు కూడా వారికి మద్దతుగా కదిలి వచ్చారు. టీడీపీ సర్కారు తీరుపై గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడు రంగు వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.