కంచికచర్లలో జర్నలిస్టుల నిరసన | Journalists protest on TDP govt over stop Sakshi telecasting in Ap | Sakshi
Sakshi News home page

కంచికచర్లలో జర్నలిస్టుల నిరసన

Published Tue, Jun 14 2016 3:34 PM | Last Updated on Mon, Aug 20 2018 8:24 PM

కంచికచర్లలో జర్నలిస్టుల నిరసన - Sakshi

కంచికచర్లలో జర్నలిస్టుల నిరసన

కంచికచర్ల (కృష్ణా జిల్లా) : సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతను నిరసిస్తూ కృష్ణా జిల్లా కంచికచర్లలో జర్నలిస్టులు ర్యాలీ చేపట్టారు. మంగళవారం కంచికచర్ల, వీరులపాడు మండలాలకు చెందిన వివిధ మీడియా సంస్థల ప్రతినిధులు జాతీయ రహదారిపై ర్యాలీగా తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లారు.

అయితే తహశీల్దార్ విజయ్‌కుమార్ వారి నుంచి వినతిపత్రం తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో మీడియా ప్రతినిధులు కార్యాలయం గోడకు ఆ వినతిపత్రాన్ని అంటించారు. సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేత అప్రజాస్వామికమని, ప్రసారాలను కొనసాగించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని అందులో కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement