kanchikacherla
-
కోడి పందాల బరుల దగ్గర బరితెగిస్తున్న టీడీపీ నేతలు
-
పొంగిన మున్నేరు వాగు.. కంచికచర్ల-చెవిటికల్లు మధ్య రాక పోకలు బంద్
సాక్షి, ఎన్టీఆర్\కృష్ణా జిల్లా: భారీ వర్షాలతో మున్నేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. కంచికచర్ల-చెవిటికల్లు రహదారిపై వరద ప్రవాహం కారణంగా గ్రామాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. మచిలీపట్నంలో లోతట్టు ప్రాంతాలు జలమయం భారీ వర్షానికి మచిలీపట్నంలో లోతట్టు ప్రాంతాలు జలమయమ్యాయి. ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పేర్ని నాని పర్యటించారు. డ్రైవర్ కాలనీ, గుమస్తాల కాలనీ, సుందరయ్య నగర్‌ను పరిశీలించారు. వర్షపు నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ధవళేశ్వరం వద్ద పెరుగుతున్న గోదావరి వరద తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి వరద పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద 10.20 అడుగులకు నీటిమట్టం చేరింది. 7.67 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేశారు. డెల్టా కాలువలకు 8వేల క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. చదవండి: మచిలీపట్నంలో ప్రముఖ వైద్యుడి భార్య దారుణ హత్య -
టెన్షన్.. టెన్షన్; నది మధ్యలో.. నాలుగు గంటలు
నందిగామ: అదో ఇసుక రీచ్.. శుక్రవారం అర్ధరాత్రి.. ఇసుక తవ్వే జేసీబీలు.. నింపుకొనే టిప్పర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరాయి. నిరంతరాయంగా ఇసుక తవ్వుతూ, వాహనాల్లో నింపుతున్నారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా నదిలో ప్రవాహం పెరిగింది.. కాసేపటికే వాహనాలను ముంచెత్తింది. పెద్ద సంఖ్యలో టిప్పర్లు, ఇతర వాహనాల డ్రైవర్లు, సిబ్బంది నదిలో చిక్కుకుపోయి.. బిక్కుబిక్కుమంటూ గడిపారు. విషయం తెలుసుకున్న అధికారులు వారిని రక్షించారు. పులిచింతల ప్రాజెక్టు దిగువన ఏపీలోని కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లు వద్ద శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బయటికెళ్లే మార్గం తెగిపోయి.. చెవిటికల్లు ఇసుక రీచ్ నుంచి రోజూ వందల వాహనాల్లో ఇసుకను తరలిస్తున్నారు. శుక్రవారం రాత్రి కూడా పెద్ద సంఖ్యలో వాహనాలు ఇసుక లోడ్ చేసుకునేందుకు రీచ్‌కు వెళ్లాయి. ఎగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు నుంచి అర్ధరాత్రి సమయంలో నీటిని విడుదల చేశారు. శనివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో నదిలో ఒక్కసారిగా వరద పెరిగింది. ఆ సమయంలో నదిలో 132 టిప్పర్లు/లారీలు, నాలుగు ట్రాక్టర్లు, కొన్ని జేసీబీలు ఉన్నాయి. నది ప్రవాహాన్ని గుర్తించిన కొందరు డ్రైవర్లు, సిబ్బంది వెంటనే బయటికి వెళ్లగలిగారు. ఇంతలోనే నదిలోకి వేసిన తాత్కాలిక మార్గం కొట్టుకుపోయింది. దాంతో 123 మంది నదిలోనే చిక్కుకుపోయారు. వాహనాలన్నీ ఆగిపోయాయి. దీనిపై సమాచారం అందిన పోలీసు, రెవెన్యూ అధికారులు శనివారం ఉదయం 6.30 గంటలకు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాలుగు గంటలపాటు శ్రమించి నాటు పడవల సాయంతో 123 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వాహనాలన్నీ నదిలోనే ఉండిపోయాయి. తెగిపోయిన మార్గాన్ని పునరుద్ధరించి వాటిని బయటికి తీసుకువస్తామని అధికారులు తెలిపారు. -
మీడియా ముసుగులో హవాలా!
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా కంచికచర్ల సమీపంలో ఇటీవల పోలీసులకు పట్టుబడిన రూ.50 లక్షల వ్యవహారంలో విస్తుగొలిపే విషయం బయటపడింది. మీడియా ముసుగులో కొందరు పెద్ద ఎత్తున హవాలా కార్యకలాపాలు సాగిస్తున్నట్టు తేలింది. వివరాలు.. ఈ నెల 20న విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్న గరుడ బస్సును కంచికచర్ల పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విశాఖ పెందుర్తికి చెందిన మహా న్యూస్ చానల్ రిపోర్టర్ సూర్యనారాయణ వద్ద రూ.50 లక్షల బ్యాగ్‌ను పోలీసులు గుర్తించారు. నగదుకు సంబంధించి సరైన ఆధారాలు చూపించకపోవడంతో పోలీసులు పూచీకత్తు రాయించుకొని.. వదిలిపెట్టారు. అయితే అదే బస్సులో హైదరాబాద్‌లో మరో రూ.3 కోట్ల నగదు కూడా దొరికినట్టు ప్రచారం జరిగింది. విశాఖ నుంచి హైదరాబాద్‌కు బస్సులో ఇంత నగదు ఎందుకు తీసుకెళ్తున్నారు? అసలు ఆ మొత్తం వారికి ఎలా వచ్చింది? అనే కోణాల్లో పోలీసులు దృష్టి సారించేలోపే.. టీడీపీ మాజీ మంత్రులు రంగంలోకి దిగి సర్దుబాటు చేసుకున్నారనే ప్రచారం జరిగింది. ఈ విషయం కాస్త బయటకు పొక్కడంతో పోలీసులు దర్యాప్తును మళ్లీ పట్టాలెక్కించారు. దీనిపై ఆదాయ పన్ను శాఖ అధికారులకు కూడా సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన ఐటీ శాఖ.. దర్యాప్తు మొదలు పెట్టడంతో హవాలా కార్యకలాపాలు వెలుగు చూసినట్టు తెలిసింది. పట్టుబడిన రూ.50 లక్షలను విశాఖకు చెందిన ఒక రియల్టర్, బిల్డర్ ఇచ్చినట్టు చెబుతున్నారు. టీడీపీ హయాం నుంచి మీడియా ముసుగులో రూ.కోట్లకు పడగలెత్తిన మీడియా హౌస్ కీలక వ్యక్తి.. పెద్ద ఎత్తున హవాలా కార్యకలాపాలకు పాల్పడినట్టు ఐటీ అధికారులు గుర్తించారని సమాచారం. ఆ మీడియా హౌస్ కేంద్రంగా గత మూడేళ్లలో రూ.30 కోట్లకు పైగా సొమ్ము హవాలా రూపంలో చేతులు మారినట్టు తెలిసింది. టీడీపీకి చెందిన కీలక నేతలు, ఎమ్మెల్యేలకు ఇందులో ప్రమేయముందని, వారి అండతోనే హవాలా వ్యవహారాన్ని చక్కబెడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రాథమిక సమాచారంతో రంగంలోకి దిగిన ఐటీ శాఖ.. ఆ న్యూస్ చానల్ డైరెక్టర్స్‌పై కూడా నిఘా పెట్టింది. దీంతో వారిలో ఒకరు పరారీలో ఉన్నట్టు తెలిసింది. -
వృద్ధ దంపతుల అనుమానాస్పద మృతి
సాక్షి, కృష్ణా : జిల్లాలోని కంచికచర్లలో వృద్ధ దంపతులు అనుమానాస్పదంగా మృతి చెందారు. మృతులు బండారుపల్లి నాగేశ్వరరావు, ప్రమీలారాణిగా గుర్తించారు. బెడ్ రూంలో విగతా జీవులుగా పడి ఉండడంతో.. దీన్ని హత్యగా భావిస్తున్నారు స్థానికులు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంటి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. మర్డర్ ఫర్ గైస్ కోణంలో దర్యాప్తు చేపట్టారు. -
సీఐడీ సోదాలు.. టీడీపీ నేతకు నోటీసులు
సాక్షి, విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో రాజధానిలో చోటు చేసుకున్న ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో సీఐడీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఈ క్రమంలో శనివారం కంచికచర్లలో సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కంచికచర్ల తెలుగుదేశం పార్టీ మార్కెటయార్డ్ మాజీ ఛైర్మన్ నన్నపనేని లక్ష్మీ నారాయణ ఇంటిలో సోదాకు వెళ్లారు. అయితే సీఐడీ వస్తుందన్న సమాచారం ముందుగానే తెలుసుకున్న లక్ష్మీనారాయణ ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోయారు. దీంతో సీఐడీ అధికారులు ఆయన ఇంటి గుమ్మానికి నోటీసులు అంటించి వెళ్లిపోయారు. కాగా లక్ష్మీనారాయణ అల్లుడు దమ్మాలపాటి శ్రీనివాసరావు.. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ అడ్వకేట్ జనరల్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. ఇక ఆయన కుమారుడు సీతారామరాజు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు, టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు సబ్ కాంట్రాక్టర్‌గా వ్యవహరించారు. (ఇన్సైడర్ ట్రేడింగ్‌లో అక్రమాల 'వరద') కాగా చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాలనలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అక్రమాలపై విచారణకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సిట్ ప్రత్యేకాధికారి, ఇంటెలిజిన్స్ డీఐజీ కొల్లి రఘురామిరెడ్డి బృందం శుక్రవారం విజయవాడలో దాడులు నిర్వహించింది. రాజధానిలో భూములు కొనుగోలు చేసిన పేదల వెనుక ఉన్న బినామీల గుట్టు విప్పేందుకు టీడీపీ నేతలకు చెందిన ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. ఇందులో భాగంగా విజయవాడ పటమటలో కొందరు కోటీశ్వరుల ఇళ్లను కూడా తనిఖీ చేసింది. వీరిలో ఒకరు టీడీపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బంధువుగా చెబుతున్నారు. వీరి ఇళ్లల్లో సిట్ పలు కీలక ఆధారాలు సేకరించింది. ఇక ఇప్పటికే రాజధాని భూముల వ్యవహారంలో టీడీపీ మాజీ మంత్రులు ప్రత్తిపాటి, నారాయణలపై సీఐడీ ఏడు కేసులు నమోదు చేసిన విషయం విదితమే. -
చిన్నారుల ప్రాణం తీసిన ఈత సరదా
సాక్షి, కృష్ణా: జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారుల్లో ఇద్దరు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని కంచికచెర్ల మండలం పెరకాలపాడు గ్రామానికి చెందిన గణేష్(10), శ్రీమంతుడు(8), గౌతమ్(7) అనే ముగ్గురు చిన్నారులు సమీపంలోని చెరువులో ఈత కొట్టడానికి వెళ్లారు. చెరువులో దిగిన ముగ్గురు ఎంతసేపటికి బయటికి రాకపోవటంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టగా ఇద్దరి మృతదేహాలు లభ్యం అయ్యాయి. కాగా గల్లంతు అయిన మరొకరి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. -
తులసి ప్రియ మృతదేహం లభ్యం
సాక్షి, కృష్ణా: నిన్న సాయంత్రం కంచికచెర్ల మండలం చెవిటికల్లు లక్ష్మయ్య వాగులో గల్లంతైన పదంకొడేళ్ల బాలిక తులసి ప్రియ మృతదేహం శనివారం లభ్యమయ్యింది. పోస్టుమార్టం నిమిత్తం ప్రస్తుతం బాలిక మృతదేహాన్ని పోలీసులు నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా పడవ ప్రమాదంలో మృతి చెందిన తులసి ప్రియ మృతదేహానికి ఎమ్మెల్యే జగన్మోహన్ రావు నివాళులర్పించారు. తులసి ప్రియ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని తెలిపారు. అంతేకాక మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు జగన్మోహన్ రావు ప్రకటించారు. పవిత్రసంగమం వద్ద భారీ వరద జిల్లాలోని పవిత్ర సంగమం వద్ద భారీగా వరద ప్రవాహం చేరుతుంది. ఇప్పటికే పవిత్ర సంగమం వద్ద పది అడుగుల లోతున నీటి ప్రవాహం చేరింది. పెర్రీలో వరద నీరు భారీగా ఇళ్లలోకి చేరుతుంది. ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఏపీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. భారీ వరదల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ కోరారు.విజయవాడ పట్టణంలోని పైపుల రోడ్డు 57వ డివిజన్ ముంపు ప్రాంతాల్లో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణ పర్యటించారు. వరద పరిస్థితులపై సమీక్షించారు. -
ఎస్బీఐ ఉద్యోగి చేతివాటం..
సాక్షి, కృష్ణా : జిల్లాలో ఓ ఎస్బీఐ ఉద్యోగి చేతివాటం చూపించాడు. రైతుల గోల్డ్‌లోన్‌లో గోల్మాల్ సృష్టించి, కోట్లరూపాయలు స్వాహా చేశాడు. వివరాల్లోకి వెళితే.. కంచికచర్ల మండలం పరిటాల ఎస్బీఐ ఉద్యోగి.. బ్యాంక్‌లో రైతుల గోల్డ్లోన్లను గోల్మాల్ చేశాడు. రైతులకు ఇచ్చిన రుణం కంటే అధిక రుణం ఇచ్చినట్లు పెద్ద మొత్తంలో నగదు డ్రా చేశాడు. 90కి పైగా నకిలీ అకౌంట్లతో కోట్ల రూపాయల నగదు స్వాహా చేశాడు. రైతులు అతడిని నిలదీయటంతో మోసం కాస్తా బయటపడింది. చేసిన మోసం బయటపడటంతో అతడు పరారయ్యాడు. -
జయరామ్ హత్య కేసు: విచారణకు శ్రిఖా, రాకేశ్
-
కంచికచర్ల పోలీస్‌స్టేషన్‌లో రాకేశ్, శిఖా
కంచికచర్ల (కృష్ణా జిల్లా): ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరామ్ అనుమానాస్పద మృతి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. జయరామ్ మేనకోడలు శ్రిఖా చౌదరి, ఆమె చెల్లెలు మనీషా, రాకేశ్ రెడ్డిలను కంచికచర్ల పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, డీఎస్పీ బోస్ ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో శిఖా చౌదరి పాత్ర ఏంటనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు జయరాం భార్య పద్మశ్రీతో ఫోన్లో పోలీసులు మాట్లాడారు. (జయరామ్‌తోఉన్నదెవరు?) జయరాం ఒంటిపై తీవ్రమైన గాయాలు లేకపోవడంతో ఆయనకు సైనైడ్ ఇచ్చారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. పరీక్ష కోసం విశ్రా శాంపిల్‌ను హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే దీనిపై స్పష్టత వస్తుందని పోలీసులు చెబుతున్నారు. జయరాంకు అనేక వివాదాలు ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని దస్పల్లా హోటల్లోని సీసీటీవీ ఫుటేజీని తీసుకున్నామని పోలీసులు తెలిపారు. టోల్గేట్ వద్ద రికార్డైన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా జయరామ్ పక్కన మరో వ్యక్తి ఉన్నట్టు తేలిందన్నారు. ఈ కేసులో టీడీపీ ఎంపీ తమ్ముడి కుమారుడి హస్తం ఉన్నట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా అతడిని కూడా విచారించాలని భావిస్తున్నారు. జయరామ్ చనిపోయిన తర్వాత రాకేశ్‌తో కలిసి శిఖా ఆయన ఇంటి వెళ్లి కీలక పత్రాల కోసం గంటసేపు గాలించినట్టు తేలింది. బెడ్రూం తాళాలు ఇచ్చేందుకు నిరాకరించిన జయరామ్ వ్యక్తిగత సిబ్బందిపై వీరిద్దరూ దాడి చేసినట్టు సమాచారం. ఉదయం ఏడు గంటల ప్రాంతంలో జయరామ్ ఇంట్లోకి చొరబడినట్టు తెలుస్తోంది. (జయరామ్ హత్యకేసులో కొత్త కోణం) కాగా, అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్న జయరామ్ కుటుంబీకులు ఇంకా హైదరాబాద్ చేరుకోకపోవడంతో అంత్యక్రియలు ఆలస్యంకానున్నాయి. మంచు తుఫాన్ కారణంగా అమెరికాలో విమాన సేవలు నిలిచిపోవడంతో జయరామ్ కుటుంబీకుల రాక ఆలస్యం కానుంది. -
టీడీపీలో అధిపత్య పోరు.. పదవి కొల్పోయిన ఎంపీపీ
సాక్షి, కంచికచర్ల: కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య అధిపత్య పోరు తారా స్థాయికి చేరింది. సొంత పార్టీకి చెందిన మండల పరిషత్ అధ్యక్షురాలు(ఎంపీపీ)ని ఆ పార్టీ ఎంపీటీసీ సభ్యులు గద్దె దించారు. వివరాల్లోకి వెళ్తే.. కంచికచర్ల ఎంపీపీ వేల్పుల ప్రశాంతిని ఆ పదవి నుంచి తప్పించటానికి గత కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో ప్రశాంతిపై అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు టీడీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు సబ్ కలెక్టర్‌ను కలిశారు. దీనిపై స్పందించిన సబ్ కలెక్టర్ అవిశ్వాస తీర్మానంపై సమావేశం నిర్వహించడానికి సభ్యులకు నోటీసులు ఇచ్చారు. అయితే దీనిపై ప్రశాంతి కోర్టును ఆశ్రయించడంతో అవిశ్వాస సమావేశం వాయిదా పడింది. ఆ తర్వాత ఎంపీటీసీలు కూడా కోర్టును ఆశ్రయించడంతో.. న్యాయస్థానం ఎంపీపీ, ఎంపీటీసీల పిటిషన్లను తిరస్కరించింది. దీంతో బుధవారం అవిశ్వాస సమావేశం జరుపుతున్నట్టు ఆర్డీఓ సభ్యులకు నోటీసులు అందజేశారు. ఆ మేరకు ఈ రోజు ఉదయం జరిగిన అవిశ్వాస తీర్మానం సమావేశానికి 15 మంది ఎంపీటీసీ సభ్యులు హాజరయ్యారు. వారందరు కూడా ప్రశాంతికి వ్యతిరేకంగా ఉన్నట్టు తెలిపారు. దీంతో ఆమె ఆ పదవిని కొల్పోవాల్సి వచ్చింది. కాగా, నేడు అవిశ్వాసంపై జరిగిన సమావేశానికి ప్రశాంతి హాజరుకాలేదు. -
ఆగి ఉన్న లారీని ఢీకొన్న లారీ: డ్రైవర్ సజీవదహనం
కంచికచర్ల: కృష్ణాజిల్లా కంచికచర్ల సమీపంలోని జాతీయరహదారిపై మంగళవారం అర్థరాత్రి జరిగిన ప్రమాదంలో లారీ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. హైదరాబాద్ నుంచి విజయవాడకు మద్యం లోడుతో లారీ వెళ్తుంది. ఆ క్రమంలో లారీ కంచికచర్ల సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న మరో లారీని ఢీకొట్టింది. దీంతో మద్యం లోడుతోఉన్న లారీలో మంటలు చెలరేగి లారీతో సహా డ్రైవర్ సజీవదహనమయ్యాడు. ఆగి ఉన్న లారీలో ఎవరూ లేకపోవటంతో ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కంచికచర్లలో జర్నలిస్టుల నిరసన
కంచికచర్ల (కృష్ణా జిల్లా) : సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతను నిరసిస్తూ కృష్ణా జిల్లా కంచికచర్లలో జర్నలిస్టులు ర్యాలీ చేపట్టారు. మంగళవారం కంచికచర్ల, వీరులపాడు మండలాలకు చెందిన వివిధ మీడియా సంస్థల ప్రతినిధులు జాతీయ రహదారిపై ర్యాలీగా తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. అయితే తహశీల్దార్ విజయ్‌కుమార్ వారి నుంచి వినతిపత్రం తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో మీడియా ప్రతినిధులు కార్యాలయం గోడకు ఆ వినతిపత్రాన్ని అంటించారు. సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేత అప్రజాస్వామికమని, ప్రసారాలను కొనసాగించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. -
పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
కంచికచర్ల (కృష్ణా జిల్లా) : మానసిక ఆందోళనకు గురైన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం కృష్ణా జిల్లా కంచికచర్లలో చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. కంచికచర్లలోని గౌతమి పబ్లిక్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న వెలగా వినయ్ కుమార్ (15) శుక్రవారం అర్ధరాత్రి తాను ఉంటున్న పెంకుటింటిలోని దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కంచికచర్ల మండలం మోగులూరు గ్రామానికి చెందిన వెలగా నర్సయ్య, సునీత దంపతులకు ఇద్దరు కుమారులు. నర్సయ్య వ్యవసాయంతోపాటు బ్రాందీషాపులో పనిచేస్తుంటాడు. పెద్దకుమారుడు వినయ్ గౌతమి పబ్లిక్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. పబ్లిక్ పరీక్షలు దగ్గర పడడంతో విద్యార్థులందరూ శుక్రవారం రాత్రి 11గంటలకు వరకు చదువుకున్నారు. అర్ధరాత్రి వినయ్ బయటకు వచ్చి గదికి గడియపెట్టి వరండాలోని దూలానికి ఉరి వేసుకున్నాడు. తెల్లవారుజాము 5.30 గంటలకు గది లోపల ఉన్న తోటి విద్యార్థులు తలుపులు తీసేందుకు ప్రయత్నించగా రాకపోవడంతో కిటికీలో నుంచి బయటకు తొంగిచూశారు. అప్పటికే దూలానికి వేలాడుతున్న వినయ్‌కుమార్‌ను చూసి కేకలు వేసి సమీపంలో ఉన్న స్కూల్ ప్రిన్సిపాల్ అబ్బూరి నాగేశ్వరరావుకు తెలియజేశారు. ఆయన పరుగున వచ్చి గది గడియ తీసి విద్యార్థులను బయటకురమ్మని, దూలానికి వేలాడుతున్న వినయ్‌ను కిందికి దించి వైద్యం నిమిత్తం స్థానిక ప్రవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికి సుమారు 3 గంటల క్రితమే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న వీరులపాడు ఎస్ఐ ఐ.అవినాష్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. విషయం తెలుసుకున్న వినయ్‌కుమార్ తల్లిదండ్రులతో పాటు బంధువులు మోగులూరు నుంచి కంచికచర్లకు చేరుకుని ఆస్పత్రిలో విగతజీవిగా పడివున్న కుమారుడిని చూపి కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
రోడ్డుప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు
కంచికచర్ల (కృష్ణా జిల్లా) : వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం ముందు వెళ్తున్న టాటా ఏస్‌ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామ సమీపంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి కంచికచర్ల వైపు బైక్ పై వెళ్లున్న ఇద్దరు యువకులు పరిటాల గ్రామ సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న టాటాఏస్ వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
ఆటో బోల్తా: మహిళ మృతి
కంచికచర్ల (కృష్ణా జిల్లా) : కంచికచర్ల మండలం బత్తినపాడు వద్ద సోమవారం ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కంచికచర్ల మండల కేంద్రం హనుమాన్‌పేటకు చెందిన సి.నాగమణి(48) అనే మహిళ మృతిచెందింది. ఆటో చెవిటికల్లు నుంచి కంచికచర్ల వెళ్తుండగా ముందు వెళ్తున్న బైక్‌ను తప్పించబోయి బోల్తా కొట్టింది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యాన్ - బైక్ ఢీ : ముగ్గురు మృతి
కంచికచర్ల: కృష్ణా జిల్లా కంచికచర్ల వద్ద జాతీయరహదారిపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. గురువారం అర్థరాత్రి సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జి.కొండూరు మండలం గంగినేనిపాలెం గ్రామానికి చెందిన సీతారామయ్య, పినపాక గ్రామానికి చెందిన వెంకటశివరామకృష్ణ, ఇబ్రహీంపట్నంనకు చెందిన విజయ్‌కుమార్ ముగ్గురు బైక్‌పై విజయవాడ వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఓమ్ని వ్యాన్ ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ రాంగ్రూట్లో రావడం వల్లనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఓమ్ని వ్యాన్‌ను, డ్రైవర్‌ను కంచికచర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
లారీ, బైక్ ఢీ: ఇద్దరు మృత్యువాత
కంచికచర్ల (కృష్ణా) : కృష్ణా జిల్లా కంచికచర్ల సమీపంలో జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం 6.30 గంటల సమయంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. కంచికచర్ల మండలం గొట్టిముక్కల గ్రామానికి చెందిన వరికూటి స్వామి (55), విజయవాడ నగరం మాచవరం ప్రాంతానికి నరుకుల వేణుగోపాల్(23) బైక్‌పై విజయవాడ నుంచి కంచికచర్ల వైపు వస్తుండగా పరిటాలలోని కోల్డ్‌స్టోరేజి సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనతో విజయవాడ-హైదరాబాద్ జాతీయరహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కంచికచర్ల పోలీసులు అక్కడికి చేరుకుని, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. -
10 నిమిషాల్లోనే వాగ్దానాలన్నీ విస్మరించారు
-
'10 నిమిషాల్లోనే వాగ్దానాలు విస్మరించారు'
కంచికచర్ల: తుళ్లూరు ఘటనపై తమ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మంత్రులు ప్రతిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు ఏకవచనంతో ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ నాయకుడు కొడాలి నాని అన్నారు. తమ నేతపై ఆరోపణలు చేసే హక్కు చంద్రబాబు, టీడీపీ నాయకులకు లేదన్నారు. కృష్ణా జిల్లా కంచికచర్లలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... కొన్ని ఎల్లో మీడియా చానళ్లు కావాలనే వైఎస్ జగన్ పై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం అయిన 10 నిమిషాల్లోనే చంద్రబాబు వాగ్దానాలు విస్మరించారని విమర్శించారు. అధికారం కోసం ఎవరి కాళ్లయినా పట్టుకునే వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. -
బిగ్‌బజార్‌లో చోరీ కేసు చేధించిన పోలీసులు
విజయవాడ: హైదరాబాద్ కాచిగూడలోని బిగ్‌బజార్‌లో జరిగిన చోరీ కేసును కృష్ణాజిల్లా పోలీసులు చేధించారు. ఆ చోరీకి పాల్పడిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 30 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.... కృష్ణాజిల్లా కంచికచర్లలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఓ వాహనంలో విలువైన వస్తువులతో వెళ్తున్న వాహనాన్ని పోలీసులు ఆపి... తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా వస్తువుల గురించి వాహనంలో ప్రయాణిస్తులను ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు వెల్లడించారు. దాంతో పోలీసులు అనుమానించి సదరు వ్యక్తులను పోలీసులు స్టేషన్‌కు తరలించి... తమదైన శైలిలో విచారణ చేపట్టారు. దాంతో శుక్రవారం అర్థరాత్రి కాచిగూడ బిగ్జబార్ చోరీ చేసింది తామేనని అంగీకరించారు. దాంతో కాచిగూడ పోలీసులు హైదరాబాద్ నగర పోలీసులకు సమాచారం అందించారు. నిందితులంతా సెక్యూరిటీ గార్డులే కావడం గమనార్హం.