కంచికచర్ల (కృష్ణా) : కృష్ణా జిల్లా కంచికచర్ల సమీపంలో జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం 6.30 గంటల సమయంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. కంచికచర్ల మండలం గొట్టిముక్కల గ్రామానికి చెందిన వరికూటి స్వామి (55), విజయవాడ నగరం మాచవరం ప్రాంతానికి నరుకుల వేణుగోపాల్(23) బైక్‌పై విజయవాడ నుంచి కంచికచర్ల వైపు వస్తుండగా పరిటాలలోని కోల్డ్‌స్టోరేజి సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనతో విజయవాడ-హైదరాబాద్ జాతీయరహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కంచికచర్ల పోలీసులు అక్కడికి చేరుకుని, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.