
సాక్షి, కృష్ణా : జిల్లాలో ఓ ఎస్‌బీఐ ఉద్యోగి చేతివాటం చూపించాడు. రైతుల గోల్డ్‌లోన్‌లో గోల్‌మాల్ సృష్టించి, కోట్లరూపాయలు స్వాహా చేశాడు. వివరాల్లోకి వెళితే.. కంచికచర్ల మండలం పరిటాల ఎస్‌బీఐ ఉద్యోగి.. బ్యాంక్‌లో రైతుల గోల్డ్‌లోన్‌లను గోల్‌మాల్ చేశాడు. రైతులకు ఇచ్చిన రుణం కంటే అధిక రుణం ఇచ్చినట్లు పెద్ద మొత్తంలో నగదు డ్రా చేశాడు. 90కి పైగా నకిలీ అకౌంట్లతో కోట్ల రూపాయల నగదు స్వాహా చేశాడు. రైతులు అతడిని నిలదీయటంతో మోసం కాస్తా బయటపడింది. చేసిన మోసం బయటపడటంతో అతడు పరారయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment