
సాక్షి, కృష్ణా: జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారుల్లో ఇద్దరు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని కంచికచెర్ల మండలం పెరకాలపాడు గ్రామానికి చెందిన గణేష్(10), శ్రీమంతుడు(8), గౌతమ్(7) అనే ముగ్గురు చిన్నారులు సమీపంలోని చెరువులో ఈత కొట్టడానికి వెళ్లారు. చెరువులో దిగిన ముగ్గురు ఎంతసేపటికి బయటికి రాకపోవటంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టగా ఇద్దరి మృతదేహాలు లభ్యం అయ్యాయి. కాగా గల్లంతు అయిన మరొకరి ఆచూకీ కోసం వెతుకుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment