ఆగి ఉన్న లారీని ఢీకొన్న లారీ: డ్రైవర్ సజీవదహనం | driver killed in road accident in krishna district | Sakshi
Sakshi News home page

ఆగి ఉన్న లారీని ఢీకొన్న లారీ: డ్రైవర్ సజీవదహనం

Published Tue, Aug 2 2016 10:17 AM | Last Updated on Sat, Sep 29 2018 5:29 PM

driver killed in road accident in krishna district

కంచికచర్ల: కృష్ణాజిల్లా కంచికచర్ల సమీపంలోని జాతీయరహదారిపై మంగళవారం అర్థరాత్రి జరిగిన ప్రమాదంలో లారీ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. హైదరాబాద్ నుంచి విజయవాడకు మద్యం లోడుతో లారీ వెళ్తుంది. ఆ క్రమంలో లారీ కంచికచర్ల సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న మరో లారీని ఢీకొట్టింది. దీంతో మద్యం లోడుతోఉన్న లారీలో మంటలు చెలరేగి లారీతో సహా డ్రైవర్ సజీవదహనమయ్యాడు. ఆగి ఉన్న లారీలో ఎవరూ లేకపోవటంతో ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement