కంచికచర్ల: కృష్ణా జిల్లా కంచికచర్ల వద్ద జాతీయరహదారిపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. గురువారం అర్థరాత్రి సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
జి.కొండూరు మండలం గంగినేనిపాలెం గ్రామానికి చెందిన సీతారామయ్య, పినపాక గ్రామానికి చెందిన వెంకటశివరామకృష్ణ, ఇబ్రహీంపట్నంనకు చెందిన విజయ్‌కుమార్ ముగ్గురు బైక్‌పై విజయవాడ వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఓమ్ని వ్యాన్ ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ రాంగ్‌రూట్లో రావడం వల్లనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఓమ్ని వ్యాన్‌ను, డ్రైవర్‌ను కంచికచర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వ్యాన్ - బైక్ ఢీ : ముగ్గురు మృతి
Published Fri, Dec 25 2015 8:52 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement