
ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: తమపై అనర్హత వేటును రద్దు చేయాలని ఆప్ మాజీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌ను డివిజన్ బెంచ్‌కు ఢిల్లీ హైకోర్టు బదిలీ చేసింది. ఆ మేరకు జస్టిస్ విభు బఖ్రుతో కూడిన ఏకసభ్య ధర్మాసనం పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ముందుంచింది. కేసును విచారించేందుకు కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలా? లేక ఇప్పటికే ఉన్న డివిజన్ బెంచ్‌కు బదిలీ చేయాలా? అన్నది మంగళవారం ప్రధాన న్యాయమూర్తి తేల్చనున్నారు. 20 మంది ఎమ్మెల్యేల అనర్హతతో ఖాళీ అయిన నియోజకవర్గాల్లో ఎన్నికల కోసం ఎలాంటి నోటిఫికేషన్లు జారీచేయవద్దని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది.