division bench
-
గ్రూప్-1: సుప్రీంకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-1 పంచాయితీ మళ్లీ హైకోర్టుకు చేరింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ గ్రూప్-1 అభ్యర్థులు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు.కాగా ఈనెల 15న సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. ముగ్గురు అభ్యర్థులు డివిజన్ బెంచ్‌కు వెళ్లారు. దీంతో మెయిన్స్ పరీక్షల నిర్వహణపై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.సుప్రీంలోనూ పిటిషన్తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థి పీ రాంబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా ప్రిలిమ్స్ నుంచి మెయిన్ ఎగ్జామినేషన్‌ను అనుమతించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అందరికీ వర్తింపజేయాలని కోరారు. ఓపెన్ కేటగిరీలో అర్హత పొందిన ఎస్సీ ఎస్టీ బీసీ మెరిట్ విద్యార్థుల సంఖ్యను రిజర్వ్ కేటగిరి నుంచి మినహాయించవద్దని తెలిపారు. రిజర్వేషన్ కేటగిరి విద్యార్థుల పై ఇది ప్రభావం చూపుతుందని, సుప్రీంకోర్టు గత తీర్పులకు ఇది వ్యతిరేకమని పేర్కొన్నారు.అక్టోబర్ 21న మెయిన్స్ ఎగ్జామ్ ఉన్న నేపథ్యంలో ఈ కేసును త్వరగా విచారణ చేయాలని కోరారు. మెయిన్స్ ఎగ్జా మ్స్‌పై స్టే విధించకుండా ఈ కేసు పై నవంబర్ 20వ తేదీన తుది విచారణ జరపడం వల్ల విద్యార్థులకు అన్యాయమని అన్నారు. త్వరగా విచారణకు స్వీకరించాలని చీఫ్ జస్టిస్ కోర్టులో సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ మెన్షన్ చేశారు. అయితే సోమవారం విచారణ చేపడతామన్న సుప్రీంకోర్టు సీజేఐ ధర్మాసనం తెలిపింది.కాగా ఈనెల 15న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈనెల 21 నుంచి 27 వరకు యథావిధిగా మెయిన్స్ పరీక్షల నిర్వహణకు తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. తాజాగా సింగిల్ బెంచ్ తీర్పుపై అభ్యర్థులు మళ్లీ కోర్టు మెట్లెక్కడంతో.. మెయిన్స్ పరీక్షల నిర్వహణపై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి.మరోవైపు జీవో 29 రద్దుతోపాటు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ సంబంధిత అభ్యర్థులు గురువారం హైదరాబాద్‌లో ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. గాంధీనగర్‌లోని కెనరాబ్యాంకు సమీపంలో ఉన్న జీహెచ్ఎంసీ ఉద్యానంలో వారంతా ఆందోళన చేపట్టారు. అనంతరం ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. న్యాయం చేయాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు భారీగా మోహరించి వారిని అరెస్టు చేసేందుకు యత్నించడంతో ఆ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు మాట్లాడుతూ.. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 31 వేల మంది వరకు క్వాలిఫై అయితే.. 34 వేల మందిని మెయిన్స్ పరీక్షలను ఎలా అనుమతిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గ్రూప్-1పై న్యాయస్థానాల్లో ఉన్న కేసులు కొలిక్కివచ్చాకే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. -
AP : గ్రూప్-1 రద్దు నిర్ణయం రద్దు, హైకోర్టు స్టే
సాక్షి, గుంటూరు: APPSC (ఏపీపీఎస్సీ) గ్రూప్ 1 పరీక్ష రద్దుపై గురువారం ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై తాత్కాలిక స్టే విధిస్తూ.. ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నవాళ్లు యధావిధిగా కొనసాగుతారని డివిజన్ బెంచ్ ఊరట ఇచ్చింది. ఏపీపీఎస్సీ దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి విచారణ 27కి వాయిదా వేసింది. 2018 గ్రూప్ వన్ కింద 167 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చింది ఏపీపీఎస్సీ. అయితే ఎంపికలో అవకతవకలు జరిగాయని, మూడుసార్లు మూల్యాంకన జరిగిందని కొందరు అభ్యర్థులు ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. మరోవైపు.. హైకోర్టు ఆదేశాలతో డిజిటల్ మూల్యాంకన రద్దు చేసి ఒకసారి మాత్రమే మాన్యువల్ గా మూల్యాంకన చేశామని వాదనలు వినిపించింది ఏపీపీఎస్సీ బోర్డు. ఇరువర్గాల వాదనలు విన్న సింగిల్ జడ్జి బెంచ్ మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. మే 26, 2022న APPSC ప్రకటించిన ఉద్యోగుల జాబితాను తిరస్కరించింది. దీంతో.. ఆ నోటిఫికేషన్ కింద ఎంపికై ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్లలో ఆందోళన మొదలైంది. అయితే.. ఆందోళన అవసరం లేదని, అభ్యర్థుల ప్రయోజనాలు కాపాడి తీరతామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో సింగిల్ బెంచ్ తీర్పును ఏపీపీఎస్సీ డివిజన్ బెంచ్ ఎదుట సవాల్ చేసింది. తీర్పుపై స్టే విధించాలని కోరింది. ఈ క్రమంలో.. మాన్యువల్‌గా ఒక్కసారే మూల్యాంకనం చేసిన సీసీ కెమెరా ఫుటేజీలను డివిజన్ బెంచ్‌కు సమర్పించింది ఏపీపీఎస్సీ. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్వర్వులపై క్షుణ్ణంగా విచారణ జరిపింది ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్. న్యాయస్థానం బెంచ్‌లో సభ్యులైన జస్టిస్ రవినాథ్ తిల్హారి, జస్టిస్ హరినాథ్ ఈ కేసులో ఇరుపక్షాల వాదనలను సమగ్రంగా విన్నారు. అన్ని పరిశీలించిన మీదట సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది డివిజన్ బెంచ్. తదుపరి విచారణ వచ్చేవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో తుది ఆదేశాలు వచ్చేంతవరకు ఉద్యోగులు తమ తమ ఉద్యోగాల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగులకు ఊరట లభించినట్లయ్యింది. మరోవైపు సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వగానే దానికి నానా వక్రభాష్యాలు జోడించి తప్పుడు ప్రచారానికి దిగింది తెలుగుదేశం, జనసేన. APPSCమీద వచ్చిన తీర్పును అడ్డుపెట్టుకుని ప్రభుత్వంపై బురద జల్లేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. ఓ ఎలక్ట్రానిక్ బోర్డు, దాంట్లో నాలుగు గ్రాఫిక్స్ పెట్టుకుని చంద్రబాబు నానా హంగామా చేశారు. ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసి అసత్యాలను ప్రచారం చేసేందుకు ప్రయత్నించారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులతో సదరు అసత్య ప్రచారాలకు ఫుల్స్టాప్ పడ్డట్టయింది. -
అధికారులను అనవసరంగా కోర్టులకు పిలవొద్దు..
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతి చిన్న విషయానికీ ప్రభుత్వాధికారులను కోర్టులకు పిలుస్తున్న కొన్ని హైకోర్టుల తీరును సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. ఇది ఎంతమాత్రం హర్షణీయం కాదని, అత్యంత తీవ్రమైన పదాలతో ఖండించాల్సిన అంశమని ఉద్ఘాటించింది. ప్రభుత్వాధికారులను అనవసరంగా కోర్టులకు పిలవవద్దని ఈ సందర్భంగా హితవు చెప్పింది. మేం పిలిచాం కనక ఆగమేఘాలపై రావాల్సిందే అన్నట్లు కొన్ని కోర్టులు వ్యవహరిస్తున్నాయని... తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వారిపై ఒత్తిడి తెస్తున్నాయని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హేమంత్ గుప్తాలతో కూడిన ధర్మాసనం స్పష్టంచేసింది. ఓ కేసులో కోర్టుకు హాజరు కావాలంటూ వైద్యారోగ్య శాఖ కార్యదర్శిని అలహాబాద్ హైకోర్టు ఆదేశించటంపై సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలైంది. దీన్ని విచారణకు స్వీకరిస్తూ సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ‘‘అధికారులు తక్షణం హాజరు కావాలంటూ హుకుం జారీ చేయటం... తద్వారా వారిపై ఒత్తిడి పెంచటమనే ప్రక్రియ కొన్ని హైకోర్టులకు అలవాటైపోయింది. కొన్ని న్యాయస్థానాలు తమకు నచ్చినట్టుగా అధికారులు పనిచేయాలనే ఉద్దేశంతో వారిని ఒత్తిడి చేస్తున్నాయి. న్యాయవ్యవస్థకు– కార్యనిర్వాహక వ్యవస్థకు ఉండే అధికారపు అధీన రేఖను దాటాలని చూస్తున్నాయి’’ అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. వారి విధులు వారికున్నాయ్... కార్యనిర్వాహక వ్యవస్థలోని ప్రభుత్వాధికారులు పాలనలో ప్రధాన భాగంగా వారి బాధ్యతలు వారు నిర్వర్తిస్తున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘‘అధికారుల చర్యలైనా, నిర్ణయాలైనా వారి సొంత ప్రయోజనాల కోసం కాదు. ప్రజాధనానికి జవాబుదారు కనక వ్యవస్థ ప్రయోజనాల కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఒకవేళ న్యాయసమీక్షలో అవి నిలబడవనుకుంటే ఆ నిర్ణయాలను కొట్టేసే పరిస్థితి హైకోర్టులకు ఎటూ ఉంటుంది. అంతేకానీ వాటికోసం అధికారులను పదేపదే పిలవటం హర్షణీయం కాదు. ఈ తీరును ఖండించి తీరాలి’’ అని బెంచ్ స్పష్టంచేసింది. జడ్జిలు తమ పరిధి తెలుసుకోవాలి... ఈ సందర్భంగా అరావళి గోల్ఫ్‌క్లబ్ వెర్సస్ చంద్రహాస్ మధ్య నడిచిన కేసును సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ‘‘న్యాయమూర్తులు వినయ విధేయతలతో మెలగాలి. వాళ్లేమీ చక్రవర్తులు కారు. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థ మూడింటికీ ఎవరి పరిధులు వారికున్నాయి. ఒకరి అధికారాల్లోకి మరొకరు చొచ్చుకురావాలనుకోవటం సరికాదు. అలాచేస్తే రాజ్యాంగ సమతౌల్యం దెబ్బతింటుంది. ఫలితం అనుభవించాల్సి వస్తుంది’’ అని ధర్మాసనం తేల్చిచెప్పింది. అధికారులకు ఎన్నో ముఖ్యమైన పనులుంటాయని, అనవసరంగా కోర్టులకు పిలవటం వల్ల అవన్నీ ఆలస్యమవుతాయని, పైపెచ్చు సదరు అధికారిపై అదనపు భారం పడుతుంది కనక ఆ పనులు మరింత ఆలస్యమవుతాయని కోర్టు స్పష్టంచేసింది. ఈ సందర్భంగా కిందికోర్టు ఉత్తర్వులను కొట్టేసింది. మీ గౌరవమేమీ పెరగదు... ‘‘కోర్టులకు ప్రభుత్వాధికారుల్ని అనవసరంగా పిలవవద్దని మరోసారి చెబుతున్నాం. వాళ్లనలా పిలవటం వల్ల మీ గౌరవమేమీ పెరిగిపోదు. కోర్టుల పట్ల గౌరవాన్ని సంపాదించుకోవాలి తప్ప ఆపాదించుకోకూడదు. ఒక అధికారి కోర్టుకు వచ్చాడంటే తన అవసరం ఉన్న మరో పని ఆగిపోతుందని గమనించండి. కొన్నిసార్లు కోర్టు పిలుపుల కోసం అధికారులు దూరాభారాలు ప్రయాణించాల్సి వస్తోంది. కాబట్టి అధికారుల్ని పిలవటమనేది ప్రజాహితానికి వ్యతిరేకం. పోనీ కోర్టు తీర్పులేమైనా నిర్ణీత సమయంలో వస్తాయా అంటే అలాంటి పరిస్థితేమీ లేదు. ఎంత ఆలస్యమవుతుందో చెప్పలేం. అధికారులు రాకున్నా... దాన్ని మించిన కలం కోర్టుల చేతిలో ఉంది. దాన్ని ఉపయోగించండి. ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో కోర్టు పేర్కొన్న అంశాలకు ప్రభుత్వం తరఫున హాజరయ్యే న్యాయవాది సమాధానమివ్వలేదనుకోండి... ఆ సందేహాన్ని ఉత్తర్వుల్లో రాయండి. ప్రభుత్వమో, ప్రభుత్వాధికారో దానికి జవాబివ్వటానికి తగిన సమయమివ్వండి’’ అని బెంచ్ స్పష్టంగా నిర్దేశించింది. ఆలోచన లేకుండా, తరచుగా, క్యాజువల్‌గా అధికారులను కోర్టులకు పిలవటాన్ని ఎంతమాత్రం హర్షించబోమని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. -
ముగ్గురు సంతానమైతే.. ప్రమోషన్..?
జైపూర్ : రెండో వివాహం ద్వారా మూడో బిడ్డను పొందినవారు కూడా పదోన్నతులకు అర్హులేనని రాజస్థాన్ హైకోర్టు తీర్పునిచ్చింది. పదోన్నతుల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ జైరాం మీనా అనే వ్యక్తితో పాటు మరో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఎమ్ఎన్ భండారి, జస్టిస్ డీసీ సోమనాయ్ డివిజన్ బెంచ్ వీరికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. జనాభా నియంత్రణలో భాగంగా రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం 2002, జూన్‌లో ఒక నిబంధనను అమల్లోకి తెచ్చింది. దాని ప్రకారం ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతులకు అనర్హులని తెలిపింది. అయితే 2015 నవంబర్ 30న ఈ నిబంధనను సడలించింది. మొదటి భార్య/ భర్త ద్వారా ఇద్దరు సంతానాన్ని పొంది, రెండవ వివాహం ద్వారా మరో సంతానాన్ని పొందిన వారు ఈ నిబంధన పరిధిలోకి రారని ప్రకటించింది. అయితే సడలించిన ఈ నిబంధనను తమకు వర్తింపచేసి పదోన్నతి ఇవ్వాల్సిందిగా జైరాం తన పిటిషన్లో పేర్కొన్నారు. కోర్టు ఈ పిటిషన్‌ను విచారించి వీరు కూడా పదోన్నతులకు అర్హులేనని తీర్పునిచ్చింది -
డివిజన్ బెంచ్‌కు ఆప్ పిటిషన్
న్యూఢిల్లీ: తమపై అనర్హత వేటును రద్దు చేయాలని ఆప్ మాజీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌ను డివిజన్ బెంచ్‌కు ఢిల్లీ హైకోర్టు బదిలీ చేసింది. ఆ మేరకు జస్టిస్ విభు బఖ్రుతో కూడిన ఏకసభ్య ధర్మాసనం పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ముందుంచింది. కేసును విచారించేందుకు కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలా? లేక ఇప్పటికే ఉన్న డివిజన్ బెంచ్‌కు బదిలీ చేయాలా? అన్నది మంగళవారం ప్రధాన న్యాయమూర్తి తేల్చనున్నారు. 20 మంది ఎమ్మెల్యేల అనర్హతతో ఖాళీ అయిన నియోజకవర్గాల్లో ఎన్నికల కోసం ఎలాంటి నోటిఫికేషన్లు జారీచేయవద్దని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. -
హైకోర్టు విభజనపై రివ్యూ పిటీషన్లను
-
హైకోర్టు విభజన కేసు విస్తృత ధర్మాసనానికి బదిలీ
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన కేసు విచారణను డివిజన్ బెంచ్ విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. హైకోర్టు విభజనపై తెలంగాణ ప్రభుత్వ రివ్యూ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగింది. హైదరాబాద్‌లోనే రెండు ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేయాలని టీ.సర్కార్ తన పిటిషన్లో కోరింది. గత తీర్పును పునసమీక్షించాలన్న పిటిషన్‌పై తీర్పును ఉమ్మడి హైకోర్టు రిజర్వ్‌లో ఉంచిన విషయం తెలిసిందే. దాంతో కేసును విచారించిన డివిజన్ బెంచ్.. తాను తీర్పును ప్రకటించలేనని, విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు ప్రకటన చేసింది. -
ఆరోపణలకు ఆధారాల్లేవ్
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు వైద్య కళాశాలల తీరుపై హైకోర్టును ఆశ్రయించిన పలు విద్యార్థులకు చుక్కెదురైంది. పలు కళాశాలలు తమ దరఖాస్తులను స్వీకరించటం లేదని, కొన్ని కాలేజీలు తమ పేర్లను మెరిట్ జాబితాలో ప్రచురించలేదంటూ పలువురు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు.. ఆ ఆరోపణలకు ఆధారాలు లేవంటూ సోమవారం కొట్టివేసింది. ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా కింద ప్రవేశాలు కోరుతున్న పలువురు విద్యార్థులు.. ఆయా కాలేజీలు తమ దరఖాస్తులను స్వీకరించలేదని, ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వలేదని, తమ పేర్లను మెరిట్ జాబితాలో ప్రచురించలేదని, పెద్ద మొత్తంలో డొనేషన్లు చెల్లించిన వారికే సీట్లు ఇచ్చి మెరిట్‌కు పాతర వేశారని ఆరోపిస్తూ పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటన్నింటిపై వాదనలు విన్న న్యాయమూర్తులు జస్టిస్ అశుతోష్మెహంతా, జస్టిస్ దామా శేషాద్రినాయుడులతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. ఆయా కాలేజీలపై ఆరోపణలు చేసిన విద్యార్థులు అందుకు సంబంధించి పూర్తి ఆధారాలను కోర్టు ముందుంచటంలో విఫలమయ్యారంటూ పిటిషన్లను కొట్టివేసింది. కాలేజీలు తమను అడ్డుకున్నాయన్న విద్యార్థులు, అలా అడ్డుకున్న వారిపై పోలీసు ఫిర్యాదు ఇవ్వకపోవటం, కాలేజీల తీరుపై యూనివర్సిటీకి వినతిపత్రం సమర్పించకపోవటం తదితర అంశాలను తన తీర్పులో ప్రస్తావించింది. అయితే వచ్చే ఏడాది నుంచైనా ప్రవేశాలను పారదర్శకంగా జరపాలన్న ధర్మాసనం.. అందుకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. దరఖాస్తులన్నీ ఏకరూపంగా ఉండేటట్లు చూడటంతో పాటు అటు కాలేజీలు, ఇటు విశ్వవిద్యాలయం కేంద్రాల్లో దరఖాస్తులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది. ప్రవేశం కోరుతున్న విద్యార్థిని ఆయా కాలేజీలు ఇంటర్వ్యూ చేసే సమయంలో యూనివర్సిటీ అధికారులు గానీ విద్యాశాఖ అధికారులు గానీ అక్కడ ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది.