ఉమ్మడి హైకోర్టు విభజన కేసు విచారణను డివిజన్ బెంచ్.. విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన కేసు విచారణను డివిజన్ బెంచ్ విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. హైకోర్టు విభజనపై తెలంగాణ ప్రభుత్వ రివ్యూ పిటిషన్పై ఇవాళ విచారణ జరిగింది. హైదరాబాద్లోనే రెండు ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేయాలని టీ.సర్కార్ తన పిటిషన్లో కోరింది. గత తీర్పును పునసమీక్షించాలన్న పిటిషన్పై తీర్పును ఉమ్మడి హైకోర్టు రిజర్వ్లో ఉంచిన విషయం తెలిసిందే. దాంతో కేసును విచారించిన డివిజన్ బెంచ్.. తాను తీర్పును ప్రకటించలేనని, విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు ప్రకటన చేసింది.