
హైకోర్టు
హైదరాబాద్: హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనా చారికి హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేలకు గన్‌మెన్‌లను కేటాయించని కారణంగా తెలంగాణ డీజీపీ, జోగులాంబ ఎస్పీ, నల్గొండ ఎస్పీలకు సుమోటోగా తీసుకుని నోటీసులు జారీ చేసింది. కేసును ఈ నెల 28కి వాయిదా వేసింది. అలాగే అసెంబ్లీ సెక్రటరీ, అసెంబ్లీ లా సెక్రటరీలకు ఫారం-01 నోటీసులు కూడా హైకోర్టు జారీ చేసింది.
వచ్చే నెల సెప్టెంబర్ 17న అసెంబ్లీ సెక్రటరీ వి.నరసింహాచార్యులు, అసెంబ్లీ లా సెక్రటరీ నిరంజన్ రావ్‌లు ఇద్దరూ నేరుగా కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల జీతాలకు సంబంధించిన వివరాలు, అసెంబ్లీ రిజిస్టర్ కోర్టుకు సమర్పించాలని సూచించింది. కోర్టు ఆదేశాలు ఎవరు ధిక్కరించినా శిక్షార్హులేనని వ్యాఖ్యానించింది. హైకోర్టు తీర్పుపై ఎమ్మెల్యే సంపత్ కుమార్ స్పందించారు. తీర్పు పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment