సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్ శాసనసభ్యత్వం రద్దుపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అదే విధంగా ఆరోజు అసెంబ్లీలో జరిగిన పరిణామాలకు సంబంధించి వీడియో ఫుటేజీలను సీల్డ్ కవర్లో సమర్పించాలని సర్కార్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 22కు హైకోర్టు వాయిదా వేసింది.
మరో వైపు ఈ కేసు పూర్తి అయ్యేవరకు గెజిట్ నోటిఫికేషన్ అమలును నిలిపేయడంతో పాటు, ఆ నోటిఫికేషన్ ఆధారంగా నల్లగొండ, అలంపూర్ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని పిటీషనర్ న్యాయస్థానాన్ని కోరారు. అయితే ఈరోజు మధ్యాహ‍్నం 3.30 గంటలకు ఎలక్షన్ కమిషన్ నిర్ణయంపై హైకోర్టు విచారించనుంది. దీంతో ఆ విచారణ తర్వాతే నోటిఫికేషన్‌పై హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment