టీ సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం | High court serious on telangana government | Sakshi
Sakshi News home page

టీ సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం

Published Tue, Apr 3 2018 12:32 PM | Last Updated on Tue, Nov 6 2018 8:51 PM

High court serious on telangana government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ శాసనసభ్యత్వం రద్దుపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వాన్ని కౌంటర్‌ ఫైల్‌ చేయాలని గతంలో కోర్టు ఆదేశించింది. అయితే ప్రభుత్వం ఇంతవరకు కౌంటర్‌ దాఖలు చేయక పోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ నెల 6 వ తేదీ లోపల కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని మరోసారి కోర్టు ఆదేశించింది.  ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసిన అనంతరం.. సోమవారం( 9 వ తేదీ) వాదనలు వింటామని హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ కౌంటర్‌ ఫైల్‌ చేయకపోతే.. ఈ కేసులో ఇక కౌంటర్‌ ఉండదని భావించాల్సి ఉంటుందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ ఈ నెల 9 వ తేదీకి వాయిదా వేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement