సీఎం గారూ.. మావాళ్ల విషయంలో జోక్యం వద్దు | Kejriwal framing my family, will expose him: AAP MLA | Sakshi
Sakshi News home page

సీఎం గారూ.. మావాళ్ల విషయంలో జోక్యం వద్దు

Published Wed, Aug 3 2016 8:18 PM | Last Updated on Wed, Apr 4 2018 7:02 PM

సీఎం గారూ.. మావాళ్ల విషయంలో జోక్యం వద్దు - Sakshi

సీఎం గారూ.. మావాళ్ల విషయంలో జోక్యం వద్దు

న్యూఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యే అసీం అహ్మద్ ఖాన్ మరోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై విమర్శలు చేశారు. కేజ్రీవాల్ తన కుటుంబ సభ్యులను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనను చంపించేందుకు కేజ్రీవాల్ కుట్ర పన్నారని ఇటీవల అసీం సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేజ్రీవాల్ పోరాటం తనపైనే కానీ, తన కుటుంబ సభ్యులపై కాదని, తమ కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోరాదని అన్నారు. కేజ్రీవాల్, ఆయన అనచరులు తన కుటుంబ సభ్యులను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు చూస్తున్నారని చెప్పారు. తన తండ్రి హజి మున్నె అలీపై తప్పుడు కేసు పెట్టవచ్చని ముఖ్యమంత్రి కార్యాలయంలో తనకు కావాల్సినవారు గత నెల 31న హెచ్చరించారని వెల్లడించారు. ఈ నెల 2న పాత ఢిల్లీ మీనా బజార్లోని తన తండ్రి షాప్ వద్దనకు ఇద్దరు మహిళలు వచ్చి కావాలనే ఆయనతో గొడవపెట్టుకున్నారని, అనుచితంగా ప్రవర్తించి తిట్టారని అసీం చెప్పారు. ఇది కుట్ర అయివుంటుందని సందేహం వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement