ఆమ్ ఆద్మీ పార్టీకి మళ్లీ చిక్కులు | another aap mla, naresh balyan booked for assault | Sakshi
Sakshi News home page

ఆమ్ ఆద్మీ పార్టీకి మళ్లీ చిక్కులు

Published Mon, Oct 10 2016 12:33 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM

ఆమ్ ఆద్మీ పార్టీకి మళ్లీ చిక్కులు - Sakshi

ఆమ్ ఆద్మీ పార్టీకి మళ్లీ చిక్కులు

ఆమ్ ఆద్మీ పార్టీ మళ్లీ చిక్కుల్లో పడింది. దేశ రాజధానిలోని మోహన్ గార్డెన్ ప్రాంతంలోగల రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిని ఆప్ ఎమ్మెల్యే నరేష్ బల్యన్ కొట్టారంటూ వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో కార్యకర్తగా పనిచేసిన హెన్రీ జార్జి మోహన్ గార్డెన్ ప్రాంతంలో ఉంటారు. బల్యన్, అతడి అనుచరులు బలవంతంగా తన కార్యాలయంలోకి ప్రవేశించి తనపై దాడి చేయడమే కాక.. ప్రాణం తీస్తామంటూ బెదిరించారని కూడా జార్జి పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో ఉత్తమ్‌నగర్ ఎమ్మెల్యే అయిన నరేష్ బల్యన్ మీద ఎఫ్ఐఆర్ దాఖలుచేసి, కేసు నమోదు చేసినట్లు డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు.

అయితే జార్జి మీద కూడా ఎమ్మెల్యే అనుచరులు ఒక కేసు పెట్టారు. అతడు తన కార్యాలయం వద్ద ఎమ్మెల్యే బల్యన్ మీద, తమమీద దాడి చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో దానిపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలుచేశారు. ఇప్పటివరకు ఈ రెండు కేసుల్లోనూ ఎవరినీ అరెస్టు చేయలేదని, దర్యాప్తు మాత్రం చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement