ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే శరద్ చౌహాన్కు ఢిల్లీ కోర్టు బెయిల్ నిరాకరించింది.
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే శరద్ చౌహాన్కు ఢిల్లీ కోర్టు బెయిల్ నిరాకరించింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం సోమవారం తిరస్కరించింది. ఎమ్మెల్యేని జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. కాగా ఆప్ మహిళా కార్యకర్త సోని ఆత్మహత్య కేసులో ఎమ్మెల్యేని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
సోని ఆత్మహత్యకు కారణమైన పార్టీ కార్యకర్త రమేశ్ భరద్వాజ్కు ఎమ్మెల్యే అండగా నిలిచినట్టు ఆరోపణలున్నాయి. తన ఆత్మహత్యకు భరద్వాజ్ కారణమని మృతురాలు సోనీ సూసైడ్ వీడియోలో తెలిపింది. కాగా వివిధ కేసుల్లో ఇప్పటివరకు అరెస్టైన 'ఆప్' ఎమ్మెల్యేల సంఖ్య 12కు చేరింది.