ఆప్ ‘ఢిల్లీ డయలాగ్’ | AAP launches Delhi Dialogue | Sakshi
Sakshi News home page

ఆప్ ‘ఢిల్లీ డయలాగ్’

Published Thu, Nov 13 2014 12:37 AM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM

ఆప్ ‘ఢిల్లీ డయలాగ్’ - Sakshi

ఆప్ ‘ఢిల్లీ డయలాగ్’

ఓటర్లతో మమేకమయ్యే చర్యల్లో ఆమ్ ఆద్మీ పార్టీ
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఓటర్లతో మమేకమయ్యే చర్యల్లో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ బుధవారం ‘ఢిల్లీ డయలాగ్’ప్రారంభించింది. ఈ కార్యమ్రం కింద తమ ఆదర్శనగరం ఎలా ఉండాలో ఢిల్లీ వాసుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తారు. నిపుణుల నుంచి గృహస్తుల వరకు, యువత నుంచి మహిళల వరకు, సమాజంలోని వివిధ వర్గాల వారితో అనుసంధానమయ్యేందుకు ఈ కార్యక్రమాన్ని ఆప్ ఎంచుకుంది. ‘‘ప్రజల ఆకాంక్షలు ఏమిటి, తమ ఢిల్లీ ఎలా ఉండాలని వారు కోరుకుంటున్నారో తెలుసుకోగోరుతున్నాం.

మేధావులు, గృహిణులు, విద్యార్థులు, యు వతీ యువకులు, మహిళలు, గ్రామస్తులు, పారిశ్రామికవేత్తలు, జేజే క్లస్టర్, అనధికార కాలనీల నివాసు లు..... ఇలా అందరినీ కలుసుకుంటాం. ఆ తరువాత ఓ 50 అంశాల కార్యక్రమాన్ని తయారు చేస్తాం. ఆ అంశాలు, సమస్యల పరిష్కారం కోసం పని చేస్తాం’’ అని ఆప్ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఈ అంశాలను తమ పార్టీ ఎన్నికల ప్రణాళికలో కూడా చేరుస్తామని అన్నారు.

ఢిల్లీ డయలాగ్ కార్యక్రమంలో భాగంగా యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 15న నగరంలో ఓ భారీ సభను నిర్వహించనున్నామని, చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక దినమైన నవంబర్ 26న మహిళల భద్రత సమస్యపై ఇటువంటిదే మరో సభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం కోసం పార్టీ నేతలు ఆశిష్ ఖేతన్, ఆదర్శ్ శాస్త్రి, మీరా సాన్యాల్, ప్రీతీ శర్మమీనన్ వంటి నేతలతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశామని కేజ్రీవాల్ చెప్పారు.

వైద్యం, విద్య, విద్యుత్, నీటి సమస్యలపై ప్రధానంగా తాము దృష్టి కేంద్రీకరిస్తామని, నిర్దిష్ట కాల పరిమితితో వీటి పరిష్కారానికి కృషి చేస్తామని ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్న ఆశిష్ ఖేతన్ చెప్పారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఆరు నెలల తరువాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఒక్క సీటులో కూడా గెలుపొందలేకపోయింది. దీంతో ఆ పార్టీ ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు విద్యార్థి, యువజన, మహిళ, మైనారిటీ, కార్మిక సంఘాలను స్థాపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement