Naresh balyan
-
ఆమ్ ఆద్మీ పార్టీకి మళ్లీ చిక్కులు
ఆమ్ ఆద్మీ పార్టీ మళ్లీ చిక్కుల్లో పడింది. దేశ రాజధానిలోని మోహన్ గార్డెన్ ప్రాంతంలోగల రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిని ఆప్ ఎమ్మెల్యే నరేష్ బల్యన్ కొట్టారంటూ వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో కార్యకర్తగా పనిచేసిన హెన్రీ జార్జి మోహన్ గార్డెన్ ప్రాంతంలో ఉంటారు. బల్యన్, అతడి అనుచరులు బలవంతంగా తన కార్యాలయంలోకి ప్రవేశించి తనపై దాడి చేయడమే కాక.. ప్రాణం తీస్తామంటూ బెదిరించారని కూడా జార్జి పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో ఉత్తమ్‌నగర్ ఎమ్మెల్యే అయిన నరేష్ బల్యన్ మీద ఎఫ్ఐఆర్ దాఖలుచేసి, కేసు నమోదు చేసినట్లు డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. అయితే జార్జి మీద కూడా ఎమ్మెల్యే అనుచరులు ఒక కేసు పెట్టారు. అతడు తన కార్యాలయం వద్ద ఎమ్మెల్యే బల్యన్ మీద, తమమీద దాడి చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో దానిపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలుచేశారు. ఇప్పటివరకు ఈ రెండు కేసుల్లోనూ ఎవరినీ అరెస్టు చేయలేదని, దర్యాప్తు మాత్రం చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
ఉత్తమ్‌నగర్‌లో మద్యం సీసాలు స్వాధీనం
సాక్షి, న్యూఢిల్లీ : స్థానిక ఉత్తమ్‌నగర్‌లోని ఓ గోదాములో ఎనిమిది వేలకుపైగా మద్యం సీసాలు లభించాయి. ఇందుకు సంబంధించి ఎన్నికల కమిషన్ కేసు నమోదు చేసింది. శుక్రవారం రాత్రి పోలీసులు, ఫ్లైయింగ్ స్క్వాడ్ చేసిన మెరుపుదాడిలో ఇవి లభ్యమయ్యాయి. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి ఒకరు వెల్లడించారు. ఇవి హరియాణాలో తయారైనట్టుగా వాటిపై ఉన్న ముద్రలు చెబుతుననాయి. ఇవి ఈ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఆప్ అభ్యర్థి నరేష్ బలియాన్వేనని బీజేపీ ఆరోపించింది. అయితే ఈ మద్యానికి తనకు ఏ సంబంధం లేదని నరేష్ బలియాన్ చెప్పారు. మద్యం సీసాలు లభించిన గోదాము బీజేపీ కార్యకర్తదని ఆయన ఆరోపించారు. మరోవైపు పోలీసులు ఇదే విషయమై మాట్లాడుతూ విచారణ పూర్తయ్యాక నిందితుల పేరును ఎఫ్ఐఆర్లో నమోదు చేస్తామన్నారు. -
ఆప్ అభ్యర్థి నివాసంలో మద్యం సీసాలు
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి నరేష్ బల్యాన్ నివాసంపై ఎన్నికల కమిషన్ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. ఢిల్లీలోని ఆయన ఇంట్లో సోదాలు చేపట్టిన అధికారులు పెద్ద ఎత్తున మద్యం బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 5వేల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న అధికారులు నరేష్ బల్యాన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా మద్యం నిల్వ చేసిందుకు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. నరేష్ బల్యాన్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 7న జరగనున్నాయి.