ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యేపై కాల్పులు | AAP Ved Prakash legislator shot at in Delhi | Sakshi
Sakshi News home page

ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యేపై కాల్పులు

Published Fri, Jul 17 2015 11:55 AM | Last Updated on Wed, Apr 4 2018 7:02 PM

వేద ప్రకాశ్(ఫైల్) - Sakshi

వేద ప్రకాశ్(ఫైల్)

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే వేద ప్రకాశ్ పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. అయితే ఈ కాల్పుల్లో ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.

ఈశ్వర్ కాలనీలోని తన కార్యాలయం వెలుపలే వేద ప్రకాశ్ పై దుండగులు కాల్పులు జరిపినట్టు వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. బవానా నియోజకవర్గానికి వేద ప్రకాశ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement